Jaggery Remedies on Tuesday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం కుజ గ్రహానికి సంబంధించిన పదార్థం. అలాగే హనుమంతుడు కుజ గ్రహానికి అధిపతిగా భావించబడతాడు. మంగళవారం రోజున శ్రీరామదూతకు బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల జాతకంలో కుజ దోషాలు తొలగిపోవడమే కాకుండా, మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

అప్పుల భారం తగ్గడానికి పరిహారం..

ఎక్కువ కాలంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మంగళవారం నాడు ఈ పరిహారం పాటించవచ్చు.

ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్లి 1.25 కిలోల బెల్లం, 1.25 కిలోల వేయించిన శనగలు సమర్పించాలి.

అందులో కొంత భాగాన్ని ప్రసాదంగా స్వీకరించి, మిగిలిన దాన్ని పేదలకు దానం చేయాలి.

ఈ విధంగా వరుసగా 11 మంగళవారాలు భక్తిశ్రద్ధలతో, ఎవరికీ ప్రచారం చేయకుండా గోప్యంగా చేస్తే అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

ఆర్థిక స్థిరత్వం, ధన లాభం కోసం..

తరచూ ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం ఎదుర్కొంటున్నవారు ఈ చిన్న పరిహారం చేయాలి.

ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో కొద్దిగా బెల్లం, ఒక రాగి నాణెం పెట్టి మూటగా కట్టాలి.

ఆ మూటను హనుమంతుడి పాదాల వద్ద ఉంచి, శ్రద్ధగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి

మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకువచ్చి ఇంట్లోని బీరువా లేదా ధనం ఉంచే సేఫ్‌లో భద్రపరుచుకోవాలి. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడి, ధనాగమనం పెరుగుతుంది.

కుటుంబంలో ప్రశాంతత కోసం..

ఇంట్లో తరచూ గొడవలు, మనస్పర్థలు ఉండి అశాంతి నెలకొంటే..

మంగళవారం సాయంత్రం వేళ హనుమంతుడికి బెల్లం, కొత్తిమీర నైవేద్యంగా సమర్పించాలి.

ఈ పరిహారం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి, ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది.

Tags: