Feel Like Someone Is Sitting on Your Chest While Sleeping: అర్ధరాత్రి నిద్రలో నుంచి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. కళ్లు తెరిచి చూస్తే గదిలోని వస్తువులన్నీ కనిపిస్తాయి. పక్కనే ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. మాట్లాడాలని ప్రయత్నించినా మాట రావడం లేదు. చేతులు, కాళ్లు కదిలించాలనుకున్నా శరీరం సహకరించదు. కొందరికి ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు, మరికొందరికి గదిలో ఏదో నీడ కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవాన్ని స్లీప్ పారాలసిస్ (Sleep Paralysis) అంటారు.

వైద్యపరంగా ఇది నిద్రలోని REM దశకు సంబంధించిన ఒక పరిస్థితి. ఈ దశలో కలల్లో కనిపించే దృశ్యాలకు అనుగుణంగా శరీరం కదలకుండా కండరాల కదలికలు తాత్కాలికంగా నిరోధించబడతాయి. అయితే కొన్నిసార్లు మెదడుకు మెలకువ వచ్చినా ఈ కండరాల నిరోధం వెంటనే తొలగకపోవడంతో ఈ అనుభవం ఎదురవుతుంది.

సాధారణంగా కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చు. నిద్రలేమి, అసమయ నిద్ర, షిఫ్ట్ డ్యూటీలు, ప్రయాణాల వల్ల నిద్ర సమయాల్లో మార్పులు వంటి అంశాలతో దీనికి సంబంధం ఉంది.

అయితే అప్పుడప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవడం మాత్రమే తీవ్రమైన వ్యాధికి సంకేతం కాదు. తరచూ రావడం, నిద్రపై భయం కలిగించడం లేదా పగటిపూట తీవ్రమైన అలసట ఉండటం వంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

Tags: