Bhagiratha: తల్లి కోసం స్వర్గం నుంచి భూమికి దిగివచ్చిన గంగాదేవి.. భగీరథుడి తపస్సుతో సాధ్యమైన మహాకార్యం!
తపస్సుతో సాధ్యమైన మహాకార్యం!
Bhagiratha: భారత పురాణాల్లో గంగావతరణ ఘట్టం అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తన పూర్వీకులకు శాపవిమోచనం కల్పించేందుకు భగీరథుడు చేసిన కఠోర తపస్సు, పట్టుదల ఈ కథలో ప్రధాన ఆకర్షణ.
సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులు ఉన్నారు. అశ్వమేధ యాగంలో భాగంగా విడిచిపెట్టిన యాగాశ్వం అదృశ్యమవడంతో వారు దానిని వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ యాగాశ్వాన్ని చూసిన వారు మహర్షిపై అపోహతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో కపిల మహర్షి తపోబలానికి సగరపుత్రులు భస్మమయ్యారని పురాణ కథనం. వారి ఆత్మలకు విముక్తి కలగాలంటే గంగానది జలాలు వారి భస్మాన్ని తాకాలని తెలియడంతో భగీరథుడు ఆ బాధ్యతను స్వీకరించాడు.
గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి బ్రహ్మదేవుడిని, అనంతరం పరమశివుడిని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేశాడు. గంగ భూమిపైకి దిగివస్తే ఆమె ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదని శివుడు తన జటాజూటంలో గంగను బంధించి, అనంతరం మెల్లగా భూమిపైకి విడుదల చేశాడు.
భగీరథుడు గంగకు మార్గదర్శకుడిగా ముందుకు సాగగా, ఆమె జలాలు సగరపుత్రుల భస్మాన్ని తాకి వారికి విముక్తి కలిగించాయని పురాణాలు చెబుతున్నాయి.
భగీరథుడి కృషికి గుర్తుగా అసాధ్యమైన కార్యాన్ని పట్టుదలతో సాధించడాన్ని నేటికీ 'భగీరథ ప్రయత్నం'గా అభివర్ణిస్తారు.