Double Shadashtaka Yoga on July 13: జూలై 13న ఆకాశంలో డబుల్ షడాష్టక యోగం.. ఆ 5 రాశుల వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం..

నష్టపోయే ప్రమాదం..

Update: 2026-07-09 10:54 GMT

Double Shadashtaka Yoga on July 13: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, వాటి స్థాన మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దృక్ పంచాంగం ప్రకారం, రాబోయే జూలై 13 నాడు అంతరిక్షంలో ఒకే రోజు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు అత్యంత అశుభకరమైన షడాష్టక యోగం ఏర్పడబోతోంది. రెండు గ్రహాలు ఒకదానికొకటి 6, 8 వ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ దారుణమైన యోగం ఏర్పడుతుంది.

జూలై 13న మొదటి షడాష్టక యోగం సాయంత్రం 6:23 గంటలకు, రెండోది రాత్రి 10:13 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ డబుల్ గండం'

కారణంగా ముఖ్యంగా వృశ్చికం సహా 5 రాశుల వారు తీవ్రమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశుల వివరాలు, జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం:

తీవ్రమైన ప్రభావం పడే ఆ 5 రాశులు ఇవే..

వృశ్చిక రాశి :

ఈ రాశి వారు రహస్య శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీపై ఆఫీసులో లేదా సమాజంలో కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత లేదా రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

పరిహారం: మంగళవారం లేదా శనివారం నాడు సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

మేష రాశి :

గ్రహాల ప్రతికూల కదలికల వల్ల మీ స్వభావంలో కోపం, చిరాకు అకస్మాత్తుగా పెరుగుతాయి. పని చేసే చోట సహోద్యోగులతో లేదా పైఅధికారులతో అనవసరమైన వాదోపవాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ మాట తీరుపై అదుపు కలిగి ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి.

సింహ రాశి :

ఈ అశుభ యోగం మీ ఆర్థిక స్థితిని, కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమయంలో ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టవద్దు, తీవ్ర నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శాంతంగా వ్యవహరించాలి.

పరిహారం: రాగి పాత్రతో ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం (నీటిని) సమర్పించండి.

కన్యా రాశి :

ఈ రాశి వారు మానసిక ఒత్తిడి, తెలియని భయానికి లోనవుతారు. చేతికి వచ్చిన పనులు చివరి నిమిషంలో నిలిచిపోవడంతో నిరాశ చెందుతారు. ఆరోగ్య పరంగా కడుపునొప్పి, గ్యాస్ లేదా నిద్రలేమి వంటి సమస్యలు వేధించవచ్చు. ఓపికతో వ్యవహరించడం ముఖ్యం.

పరిహారం: బుధవారం నాడు పేదలకు పచ్చ పెసలు దానం చేయండి.

కుంభ రాశి :

అనూహ్యంగా వచ్చే పెద్ద పెద్ద ఖర్చుల వల్ల మీ నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతుంది. పరిస్థితి అప్పులు చేసే స్థాయికి వెళ్లవచ్చు. చాలా అత్యవసరమైతే తప్ప ఈ కాలంలో సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.

పరిహారం: 'ఓం శం శనైశ్చరాయ నమః' అనే శని మంత్రాన్ని జపించండి.

ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

చేయాల్సినవి: గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి జూలై 13న శివారాధన చేయడం, మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం అత్యంత పవర్‌ఫుల్ పరిహారంగా నిపుణులు చెబుతున్నారు.

చేయకూడనివి:

ఈ రోజు ఎలాంటి కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయడం, కొత్త ఒప్పందాలపై సంతకాలు పెట్టడం వంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి.

Tags:    

Similar News