Goddess Lakshmi’s Blessings with Venus Transit: ఫిబ్రవరి 22 నుంచి ఈ 5 రాశుల జాతకం మారబోతోంది.. శుక్రుని సంచారంతో లక్ష్మీ కటాక్షం..
శుక్రుని సంచారంతో లక్ష్మీ కటాక్షం..
Goddess Lakshmi’s Blessings with Venus Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం మానవ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, ఫిబ్రవరి మాసాంతంలో ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి, ప్రేమకు కారకుడైన శుక్ర గ్రహం తన స్థానాన్ని మార్చుకోనుంది.
పంచాంగం ప్రకారం.. ఫిబ్రవరి 22న శుక్రుడు శతభిష నక్షత్రం నుండి నిష్క్రమించి, పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఐదు రాశుల వారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి
మేష రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న అపార్థాలు తొలగిపోతాయి.నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఈ మార్పు ఒక వరంలా మారనుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగం, మీడియా రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో సీనియర్ల మద్దతు లభిస్తుంది. గందరగోళం తగ్గి పనుల్లో స్పష్టత వస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
సింహ రాశి
సింహ రాశి వారి జీవితంలో భాగస్వామ్యాలు బలపడతాయి. అది వ్యాపారమైనా లేదా వ్యక్తిగత జీవితమైనా సమతుల్యత ఏర్పడుతుంది. ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలవుతాయి. ఆర్థిక నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. భావోద్వేగాలకు లోనై కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి.
తుల రాశి
శుక్రుని మార్పు తుల రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.
మకర రాశి
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మకర రాశి వారికి ఈ సంచారం ఊరటనిస్తుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
శుక్రుని ఈ నక్షత్ర మార్పు వల్ల జీవితంలో స్థిరత్వం, స్పష్టత వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆనందానికి కారకుడు కాబట్టి ఈ ఐదు రాశుల వారు ఫిబ్రవరి 22 నుండి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంది.