Goddess Durga Worship with Betel Leaf Garland: దుర్గాదేవికి తమలపాకుల దండ: 9 మంగళవారాలు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పటాపంచలే..
9 మంగళవారాలు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పటాపంచలే..
Goddess Durga Worship with Betel Leaf Garland: జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి భక్తి మార్గంలో అనేక పరిహారాలు ఉన్నాయి. అందులో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి తమలపాకుల దండను సమర్పించడం అత్యంత శక్తివంతమైనదని జ్యోతిష్య నిపుణులు వివరించారు. దుర్గ అంటేనే దురదృష్టాలను నాశనం చేసే తల్లి అని, ఆమెను ఆశ్రయిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఎలాంటి సమస్యలకు ఈ పూజ పరిష్కారం?
మీరు ఈ సమస్యలతో సతమతమవుతుంటే ఈ ప్రత్యేక పూజ అద్భుతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు..
మానసిక స్థితి: ఒంటరిగా కూర్చుని ఆలోచించడం, నిరాశ, భయం, మానసిక సోమరితనం లేదా జ్ఞాపకశక్తి తగ్గడం.
ఆరోగ్యం: మాటలో నత్తి, కళ్లలో నీళ్లు రావడం, నాలుక ఎండిపోవడం వంటి శారీరక ఇబ్బందులు.
వృత్తి - వ్యాపారం: వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు, కోర్టు కేసులు లేదా రాజకీయంగా అవమానాలు ఎదురైనప్పుడు.
మహిళల సమస్యలు: స్త్రీలకు ఎదురయ్యే ప్రత్యేక ఆరోగ్య సమస్యల నివారణకు కూడా ఇది మేలు చేస్తుంది.
పూజా విధానం - నియమాలు:
ఈ పరిహారాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలని వివరించారు
సమయం: వరుసగా తొమ్మిది మంగళవారాల పాటు సాయంత్రం వేళ ఈ పూజ చేయాలి.
దండ తయారీ: ఒక దండలో 45 తమలపాకులు ఉండేలా సిద్ధం చేసుకోవాలి.
సమర్పణ: ఈ తమలపాకుల దండను శ్రీ దుర్గాదేవికి లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో సమర్పించాలి.
నైవేద్యం: బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి.
మంత్రం: దండ సమర్పించిన తర్వాత ఆలయంలో కాసేపు కూర్చుని “ఓం దుం దుర్గాయై నమః” అనే మంత్రాన్ని భక్తితో జపించాలి.
చివరి మంగళవారం ఏం చేయాలి?
తొమ్మిదవ మంగళవారం నాడు ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, మీ ఇంట్లోని ముగ్గురు పెద్దలకు అరటిపండుతో కూడిన తాంబూలాన్ని ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బాధలన్నీ తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం.
నమ్మకంతో చేసే ఏ చిన్న పూజ అయినా పెద్ద ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా రాహు దోషాలు లేదా జాతక రీత్యా ఇబ్బందులు ఉన్నవారికి ఈ 'తాంబూల దండ' పూజ ఒక వరప్రసాదం వంటిదని గురూజీ సలహా ఇస్తున్నారు.