Tirumala Nambi Avatar Mahotsavam: తిరుమలలో ఘనంగా తిరుమల నంబి 1053 అవతార మహోత్సవాలు
1053 అవతార మహోత్సవాలు
Tirumala Nambi Avatar Mahotsavam: తిరుమల ప్రధమ పౌరుడిగా తిరుమలేశునికి కైంకర్యం చేసి తరించిన మహనీయుడు శ్రీ తిరుమలనంబి వారి 1053వ అవతార మహోత్సవాలు తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో ఉన్న తిరుమల నంబి వారి సన్నిధిలో శుక్రవారం ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతం నుండి విచ్చేసిన 16 మంది పండితులు తిరుమల నంబి జీవితంపై ఉపన్యాసాలు చేశారు.
101 సంవత్సరాలు నిండిన పండితుడు శ్రీ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పుండరీకాక్షుడు, భగవద్రామానుజులు, వేదాంత దేశికులు తిరుమల ప్రథమ పౌరుడైన శ్రీ తిరుమల నంబి మార్గంలో నడిచి ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఇతోధికంగా వ్యాప్తికి తెచ్చారని తెలిపారు.
అంతకుముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల నంబి వారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం.తిరుముడిశై ఆళ్వార్, తిరుమల నంబి వంశీయులు శ్రీ టి.కె.శేషాద్రి స్వొమి, శ్రీ టి.కె.ముకుంద తాతాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.