Grand Diwali Celebrations at TTD Local Temples: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యాల్లో సోమవారం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు.. అనంతరం దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు.దీపావళి సందర్భంగా సోమ‌వారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో దీపావళి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు దీపావ‌ళి ఆస్థానం శాస్త్రవేత్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వహించారు ఇందులో స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు.. సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వహించారు.

Tags: