Negative Energies: ఇంట్లో నుంచి దుష్టశక్తులు వెళ్లాలంటే ఈ మొక్కను పెంచండి
ఈ మొక్కను పెంచండి;
Negative Energies: వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మందార పువ్వు దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచడం మంచిది. వాస్తులో ఈ రెండు దిశలు అదృష్టాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయని భావిస్తారు.
మందార పువ్వులు సాధారణంగా గ్రామాల్లో కనిపిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే, మొక్క ఎండిపోకుండా ఉండటానికి తరచుగా నీరు పోసి జాగ్రత్తగా పెంచాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, అప్పుల పాలైనవారు ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే దోషాలు తగ్గుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శుక్రవారాల్లో మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశంలో మందార పువ్వులను ఉంచడం, గణేశుడు, దుర్గాదేవిని ధ్యానించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇది 7 రోజుల పాటు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయని అంటారు.
కుటుంబ సంబంధాలలో విభేదాలు, ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. మందార పువ్వుతో బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక పరిష్కారం ఉంది. మీరు పడుకునేటప్పుడు ఈ పువ్వును మీ దిండు కింద పెట్టుకోండి. ఇది మనసును ప్రశాంతపరుస్తుందని. సంబంధాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
ఇంట్లో శాంతిని కోరుకునే వారు రాత్రిపూట రాగి గిన్నెలో నీటితో కలిపిన మందార పువ్వులను ఉంచి, సూర్యోదయ సమయంలో సూర్యుడిని పూజించి, ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు. ఇది శుభాన్ని పెంచుతుంది. దుష్టశక్తులను తొలగించడానికి సహాయపడుతుంది.
వాస్తు ప్రకారం.. ఇంట్లో మందార మొక్క ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తి రావడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఈ మొక్క ఇంటికి పచ్చదనం, అందం, మంచి వాతావరణాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.