Guru Aditya Rajyoga 2026: గురు ఆదిత్య రాజయోగం 2026: ఈ 3 బర్త్ నంబర్ల వారికి తిరుగులేని అదృష్టం.. కెరీర్, ఆదాయం పీక్స్‌కు..
కెరీర్, ఆదాయం పీక్స్‌కు..
Guru Aditya Rajyoga 2026: న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం గ్రహాల కదలికలు, రాశి మార్పులు మన పుట్టిన తేదీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, అరుదైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడింది. నవగ్రహాల అధిపతి అయిన సూర్యుడు , దేవగురువు అయిన బృహస్పతి కలయిక వల్ల ఈ అద్భుత రాజయోగం సంభవిస్తుంది. ఈ యోగం వల్ల ముఖ్యంగా 1, 3, 9 బర్త్ నంబర్లు కలిగిన వారికి కెరీర్, ఆర్థిక రంగాలలో ఊహించని భారీ లాభాలు కలగబోతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
లబ్ధి పొందనున్న ఆ 3 లక్కీ బర్త్ నంబర్లు..
బర్త్ నంబర్ 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు):
బర్త్ నంబర్ 1 కు అధిపతి సూర్యుడు. గురు ఆదిత్య యోగం వల్ల వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు అంతకంతకూ పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ కాలం అత్యంత అనుకూలం. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
బర్త్ నంబర్ 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు):
బర్త్ నంబర్ 3 కు అధిపతి దేవగురువైన బృహస్పతి. ఈ యోగం వీరికి విపరీతమైన జ్ఞానాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులకు, రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన విజయాలు దక్కుతాయి. మీ ఐడియాలకు ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. సమాజంలో పెద్దల మద్దతుతో మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
బర్త్ నంబర్ 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు):
బర్త్ నంబర్ 9 కు అధిపతి అంగారకుడు. సూర్యుడు, గురుడు ఇద్దరూ కుజుడికి మిత్ర గ్రహాలు కావడం వల్ల వీరికి లక్ లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కాంట్రాక్టులు, డీల్స్ కుదురుతాయి. పోటీదారులపై మీరు విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ లేదా ఆస్తి కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అకస్మాత్తుగా ఆస్తి కలిసి వచ్చే యోగం ఉంది. లాంగ్ పెండింగ్ అప్పులు తీరిపోతాయి.