Guru Planet Transit 2026: గురు గ్రహ సంచారం 2026: జూన్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి కష్టాలు.. జాగ్రత్తలు తప్పనిసరి..
జూన్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి కష్టాలు.. జాగ్రత్తలు తప్పనిసరి..
Guru Planet Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు, రాశి మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల స్థానాన్ని బట్టే మానవ జీవితంలో హెచ్చుతగ్గులు, శుభాశుభాలు నిర్ణయించబడతాయి. ఈ క్రమంలోనే 2026 జూన్ 2న ఒక కీలకమైన గ్రహ మార్పు జరగబోతోంది. నవగ్రహాలలో అత్యంత శుభ గ్రహంగా భావించే గురు గ్రహం తన ప్రస్తుత స్థానాన్ని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. జ్యోతిష్య గణనల ప్రకారం, కర్కాటక రాశి గురు గ్రహానికి ఉచ్ఛస్థితి. జ్ఞానం, సంపద, సంతానం, అదృష్టానికి కారకుడైన గురుడు ఇక్కడ శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే గోచార రీత్యా ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను, ఇబ్బందులను తీసుకురానుంది. ఆ అశుభ రాశులు ఏవి? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
గురు గ్రహం మేష రాశి వారికి *నాల్గవ ఇంట్లోకి* ప్రవేశిస్తుంది. దీనివల్ల ఈ రాశి వారు కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ఇళ్ల మరమ్మతులు లేదా తల్లి గారి ఆరోగ్య సమస్యల కారణంగా భారీగా డబ్బు ఖర్చు కావచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఓపికగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు మాట జారకుండా జాగ్రత్త వహించడం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటం ముఖ్యం.
మిథున రాశి
గురుడు మీ రాశిని విడిచిపెట్టి రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మితిమీరిన ఖర్చులు మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. మీ మాట తీరు వల్ల కుటుంబంలో అనవసర విభేదాలు, తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. దుబారా ఖర్చులను పూర్తిగా నియంత్రించుకోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటూ, ప్రతి పనిని ఓపికగా ఆలోచించి మాత్రమే నిర్ణయించుకోవాలి.
తులా రాశి
తులా రాశి వారికి గురు గ్రహంపదవ భావంలోకి ప్రవేశిస్తుంది. ఇది మీ వృత్తి జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఆకస్మిక మార్పులు, ఒత్తిడులు ఎదురవుతాయి. పై అధికారులతో సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.ఆఫీసులో ఇతరులతో వివాదాలకు దిగకండి. మీ సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, పై అధికారులతో సమన్వయం పాటించండి. పనిలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి గురుడు ఆరవ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో ఆరోగ్యం, శత్రువుల పట్ల చాలా అలర్ట్‌గా ఉండాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాగే గుప్త శత్రువుల వల్ల ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. ఎవరితోనూ అనవసర పరిచయాలు, గొడవలు పెట్టుకోవద్దు. చట్టపరమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి.