Guru Transit 2026: గురు సంచారం 2026.. జూన్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. అపార ధనలాభం..
అపార ధనలాభం..
Guru Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నింటిలోనూ బృహస్పతి అత్యంత శుభ గ్రహంగా, అదృష్టాన్నిచ్చే దైవంగా పరిగణించబడుతుంది. గురు గ్రహ సంచారానికి, రాశి మార్పునకు జ్యోతిషంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే రాబోయే జూన్ 2వ తేదీన ఒక అద్భుతమైన ఖగోళ మార్పు చోటుచేసుకోబోతోంది. గురు దేవుడు ప్రస్తుతం ఉన్న మిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశి లోకి ప్రవేశించబోతున్నాడు.
జ్యోతిష్య నియమాల ప్రకారం కర్కాటక రాశి గురుడికి "ఉచ్ఛ స్థానం". తన ఉచ్ఛ రాశిలోకి గురుడు ప్రవేశిస్తుండటంతో ఈ సంచారం అత్యంత శక్తివంతమైనదిగా మారబోతోంది. దీని ప్రభావం 12 రాశుల వారిపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారి జీవితాల్లో ఈ మార్పు అఖండమైన అదృష్టాన్ని, అపార ధనలాభాన్ని తీసుకురాబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కర్కాటక రాశి
గురు గ్రహం మీ స్వరాశిలోనే ప్రవేశిస్తుండటంతో ఈ కాలం మీకు స్వర్ణయుగమనే చెప్పాలి. సమాజంలో మీ హోదా, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఇతరుల నుండి అమితమైన గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగ, వృత్తి రంగాలలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మీ ఆలోచనా శైలి, గ్రహణ శక్తి మెరుగుపడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ గురు సంచారం ఊహించని ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. ఎక్కడైనా నిలిచిపోయిన లేదా చిక్కుకుపోయిన ధనం ఈ కాలంలో తిరిగి మీ చేతికి అందుతుంది. గతంలో మీరు స్టాక్ మార్కెట్, భూములు (ఆస్తి) లేదా వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు అంచనాలకు మించిన భారీ రాబడి (రిటర్న్స్) లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం.
---
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి అధిపతే గురు దేవుడు కావడం వల్ల, మీ రాశి వారికి ఈ సంచారం అన్ని విధాలా శుభాలను చేకూరుస్తుంది. ఉద్యోగంలో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రమోషన్ (పదోన్నతి) మరియు జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీరు చేపట్టే వ్యాపార పర్యటనలు, ప్రయాణాలు అత్యంత లాభదాయకంగా మారుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ కాలం కుటుంబ సౌఖ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కుటుంబంలో సతాయిస్తున్న ఆస్తి గొడవలు లేదా ఇతర సమస్యలు సరుదు మణిగి శాంతి, పరస్పర ప్రేమ పెరుగుతాయి. పెళ్లికాని యువతీ యువకులకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే వైవాహిక బంధం మునుపటి కంటే మరింత బలపడుతుంది. అదృష్టం మీ పక్షాన ఉండటం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తయి మనశ్శాంతి లభిస్తుంది.
జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే ఈ గురు సంచారం ఈ నాలుగు రాశుల వారికి వృత్తి, వ్యాపార, కుటుంబ విషయాల్లో తిరుగులేని విజయాలను అందించబోతోంది. ఈ కాలంలో గురు గ్రహ అనుగ్రహం కోసం గురువారం నాడు దత్తాత్రేయుడిని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం, శనగలు దానం చేయడం మరింత శుభప్రదం.