Hanuman Jayanti Celebrations: కొండగట్టులో చిన జయంతి వేడుకలు
చిన జయంతి వేడుకలు
Hanuman Jayanti Celebrations: రామలక్ష్మణ జానకి.. జై బోలోహనుమాన్ కి నినాదాలతో కొండగట్టు గుట్టలు మార్మోగుతున్నాయి. రేపు చిన హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి పాదయాత్రగా వస్తున్న దీక్షాప రులతో అంజన్న సన్నిధి సందడిగా మారింది.
దీక్షాపరులు ఇరుముడులతో తెల్లవారుజాము నుంచే కొండకు చేరుకొని కోనేరులో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారు లు తెలిపారు. రేపు హనుమాన్ జయంతి నేపథ్యంలో భక్తుల రాక అధికంగా ఉంటుందని పోలీసులు భద్రత పెంచారు. 750 మంది పో లీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. జయంతి సందర్భంగా స్వామి వారికి పంచామృత అభిషేకం చేశారు.
చిన హనుమాన్ జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవా రుజామున తలనీలల కోసం ప్రత్యేకంగా వేసిన చలువ పందిర్లు గాలికి కూలిపోవడం తో భక్తులు, సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అధికారులు హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు.