08-06-2025 నుంచి 14-06-2025 వరకు రాశి ఫలాల

Update: 2025-06-07 09:09 GMT


 



మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కెరియర్ పైన దృష్టి సారిస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరావళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. మొత్తం మీద మేషరాశి వారికి గత రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు బ్లూ.

వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలను ఘనంగా చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు లైసెన్సులు లాభిస్తాయి. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవానుగ్రహం వల్ల మీరు కోరిన కోరికలు ఫలిస్తాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి మంచి ఆదరణ లభిస్తుంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గోధుమ రంగు. ప్రతిరోజు కూడా సుబ్రమణ్య స్వామి వారి అష్టకం చదవండి మరియు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు ఊహించని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాలు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు పలుస్తాయి వీసా లభిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు. కొంతమంది విషయంలో ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో నలుగురిని ఆకట్టుకుంటారు. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్న కళాశాలలో సీట్ లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది సర్వసాధారణ అవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు

కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ వారం పూర్తవుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ విద్య అనుకూలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. చేయని తప్పులకు నిందపడవలసి వస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. సుబ్రహ్మణ్య స్వామి వారి కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

సింహరాశి : (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సొంతంగా వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కాలమనుకూలంగా ఉంది. దైవానుగ్రహం వల్ల ఇది ముందుకు సాగుతుంది. కష్టేఫలి అని నమ్ముతారు. చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఉద్యోగ వ్యవహారాలలో ఉన్న చిక్కులను అధిగమిస్తారు. సినిమా రంగంలో ఉన్న వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి మరియు మెడలో కాలభైరవ రూపు ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.


కన్య: (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. సంతానం యొక్క అభివృద్ధిని మానసిక సంతోషానికి కారణం అవుతుంది. వివాహం కొంత ఆలస్యమైనప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. మీకంటూ ఒక స్థాయి స్థానం సంపాదించుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి అలాగే దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

తుల: (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ధన, వస్తు,వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఈ వారం తొలగిపోతాయి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. క్రయవిక్రయాలలో లాభాలు బాగుంటాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్న వారికి ఈ వారం ఒక మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు గురు గ్రహ స్తోత్రం చదవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో ప్రతిరోజు దీపారాధన చేయండి.

వృశ్చికం: (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతానం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతన చూసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడితే భవిష్యత్తు బాగుంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా లేవు. ఈ రాశుల జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు.

ధనస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉండే అవకాశం ఉంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో. అమ్మవారికి ఆరావళి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. గణపతి స్వామివారిని ప్రతిరోజు ఆరాధించండి గణపతి స్వామి వారిని గరికతో పూజించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఆరెంజ్.

కుంభం: (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కీళ్ల నొప్పులు గ్యాస్టిక్ సమస్యలు చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ఒక రకంగా ఈ రాశి వారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటాయి. గో సేవ చేయండి. గోశాలలో గరిక దానం చేయండి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగునేవి బ్లూ.

మీనం: (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ ఆరోగ్యపరంగా బాగుంటుంది. బంధుమిత్రులతో చిన్నచిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగం మారాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండండి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండండి. పనులు మందకొడిగా సాగుతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. క్రయ విక్రయాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి మంచి ఆదరణ లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎల్లో.

సోమేశ్వర శర్మ గారు - వైదిక్ ఆస్ట్రాలజర్

84669 32223, 90141 26121

Tags:    

Similar News