Horoscope : రాశిఫలాలు... 06.07.25 నుంచి 12.07.25 వరకు
ఈ వారం రాశిఫలాలు;
పండగలు – పర్వదినాలు ...
––––––––––––––––––––––
06, ఆదివారం, తొలి ఏకాదశి.
07, సోమవారం, చాతుర్మాస్య వ్రతారంభం.
08, మంగళవారం, గురుమౌఢ్య త్యాగం.
10, గురువారం, గురుపూర్ణిమ.
–––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ప్రారంభంలో ఒడిదుడుకులు కొన్ని ఎదురైనా లెక్కచేయరు. క్రమేపీ మీ అంచనాలు, వ్యూహాలు నిజం కాగలవు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి కావడంలో స్నేహితుల పాత్ర ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు పోటీని ఎదుర్కొని సాధిస్తారు. ఎంతటి వారినైనా మీ మాటల ద్వారా ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరాలు పెరిగిన కొద్దీ డబ్బు అందుతునే ఉంటుంది. రుణబాధలు క్రమేపీ తొలగుతాయి. షేర్ల విక్రయాలు పూర్తి చేసి మరింత డబ్బు అందుతుంది. అందరి శ్రేయస్సు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ అభిప్రాయాలపై సోదరులు అంగీకారం తెలియజేస్తారు. వివాహాది వేడుకలపై ఏర్పాట్లు చేస్తారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమ ఫలిస్తుంది. 09,10 తేదీల్లో ఆదాయం అంతగా కనిపించదు. శారీరక రుగ్మతలు. కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు సంతోషం కలిగిస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పలుకుబడి, ఉన్నతస్థితి కలిగిన వ్యక్తులు కొంత సహాయపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్యమైన చర్చలు జరుపుతారు. మీరన్నదే వేదంగా నిలిచే సమయం. పట్టుదలతో కొన్ని ఇబ్బందులు, సమస్యలు అధిగమిస్తారు. డబ్బుకు కొదవలేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక రుణాలు క్రమేపీ తీరుస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. మీ ఆలోచనలతొ కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. కొన్ని నిర్ణయాలు సోదరులతో చర్చించి తీసుకుంటారు. ఆస్తుల విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. భాగస్వాములు మీ వ్యూహాలను అంగీకరిస్తారు. ఉద్యోగులు కోరుకున్న విధంగా మార్పులు పొందే అవకాశం. కళాకారులు, పరిశోధకుల కృషి, యత్నాలు ఫలిస్తాయి. 11,12 తేదీల్లో కొన్ని వ్యవహారాలు మధ్యలోనే విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
పొరపాట్లు సరిదిద్దుకుని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. కొత్త సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము సమకూర్చుకుంటారు. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాల ప్రస్తావన. పెద్దల ప్రోత్సాహం, సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి. భాగస్వాములతో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పనిభారం కాస్త తగ్గుతుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. 10,11 తేదీల్లో సోదరులు, మిత్రులతో కలహాలు. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి. జ్వరం, చర్మ సంబంధిత రుగ్మతలు. శివాష్టకం పఠించండి.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
వ్యతిరేక పరిస్థితుల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలు స్నేహితులతో పంచుకుని ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. అనూహ్యంగా కొంత సొమ్ము అంది ఆశ్చర్యపడతారు. రుణాలు తీరే సమయం. కొత్త షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌చేస్తారు. స్థిరాస్తుల విక్రయాలు పూర్తి చేసి కొంత లబ్ధి పొందుతారు. కుటుంబంలోని అందరి ప్రోత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో చికాకులు తొలగుతాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగ విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. 06,07 తేదీల్లో అదనపు బాధ్యతలు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
పరిస్థితుల ప్రభావంతో ఇంతకాలం పెండింగ్‌లో పడిన పనులు పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. కొత్త కాంట్రాక్టులు పొంది ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. రావలసిన డబ్బు సమకూరుతుంది. అవసరాలు తీరతాయి. సమాజసేవకు కొంత సొమ్ము వెచ్చిస్తారు. షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు. కుటుంబసభ్యుల ఆప్యాయతను పొందుతారు. వివాహాది శుభకార్యాలపై తుది చర్చలు సాగిస్తారు. పెద్దల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలను అనుకున్న విధంగా విస్తరిస్తారు. భాగస్వాముల సహాయంతో మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ఆత్మవిశ్వాసమే విధి నిర్వహణలో తోడ్పడుతుంది. విశేష పేరుప్రతిష్ఠలు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు. 08,09 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై మీకు ఇబ్బందిగా మారవచ్చు. ఎంత కష్టించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. పట్టుదల, ధైర్యం కలిగి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకోవడంలో విఫలం చెందుతారు. స్నేహితులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు ఎంత శ్రమించినా దక్కకపోవడం నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. అప్పులు తీర్చాలనుకున్నా అవసరాలు పెరిగి వెనుకడుగు వేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తారు. కుటుంబ సమస్యలు ఎదురై సవాలుగా మారవచ్చు. సోదరులతో అకారణంగా విభేదాలు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి ఒత్తిడులు, సమస్యలు ఎదురుకావచ్చు. దీక్షా, పట్టుదలతో అధిగమించి స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు జరుగుతాయి. ఉన్నతాధికారులతో విభేదిస్తారు. పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొన్ని చికాకులు తప్పవు. 06,07 తేదీల్లో ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. అనుకోని ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యవహారాల్లో విజయం తథ్యం. ఆంజనేయ దండకం పఠించండి.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
విద్యార్థులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అంది ఉత్సాహాన్నిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురై ఆకట్టుకుంటాయి. కాంట్రాక్టర్లకు మరింత అనుకూల సమయం. వాహనాలు, స్థలాలు కొంటారు. సొమ్ములు అందుతూనే ఉంటాయి. ఇతరుల వద్ద నిలిచిపోయిన సొమ్ము సైతం అందుతుంది. వివిధ సంస్థలలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. రుణబాధలు తీరతాయి. సోదరులు,సోదరీలతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. సంతానపరంగా శుభవర్తమానాలు అందుతాయి. మీ ఖ్యాతి, గౌరవప్రతిష్ఠలకు కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. పెట్టుబడులు సైతం అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గి ఊరట చెందుతారు. కొత్త బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. 11,12 తేదీల్లో ఆదాయం అంతగా లేక రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఎటువంటి కార్యక్రమాన్నైనా స్వశక్తితోనే పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు, కొనుగోళ్లలో ముందడుగు వేస్తారు. అవసరాలు పెరిగినా డబ్బుకు లోటు రాదు. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. శుభకార్యాల రీత్యా కూడా ఖర్చులు ఎదురవుతాయి. బంధువుల సహాయసహకారాలు అందుతాయి. సంతానపరంగా నెలకొన్న కొన్ని సమస్యలు తీరతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలకు లోటు రాదు. పెట్టుబడులు మరింతగా పెంచుతారు. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కార్యసిద్ధి, ఆహ్వానాలు అందుతాయి. 08,09 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో విరోధాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
అనుకున్న పనుల్లో వేగం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన విద్యావకాశాలతో విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పరిచయాలు మరింత విసృ ్తతమవుతాయి. అనుకోని విధంగా డబ్బు అందుతుంది. ఆస్తుల విక్రయాలను పూర్తి చేసి అదనపు ఆదాయం పొందుతారు. వివిధ పథకాలలో ఇన్వెస్టుమెంట్లు చేస్తారు. కుటుంబంలోని అందరి ఆమోదంతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరీలతో శుభకార్యాలపై చర్చిస్తారు. సంతానం ఆరోగ్యం కుదుటపడి కాస్త ఊరట చెందుతారు. వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడులు తొలగుతాయి. విధుల్లో ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. 10,11 తేదీల్లో శ్రమాధిక్యం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. చికాకులు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులు, మిత్రులతో గతాన్ని గుర్తు చేసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలను శ్రమపడ్డా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. సొమ్ములకు ఇబ్బందులు తొలగుతాయి. అప్పులు తీరతాయి. షేర్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. అలాగే, పొదుపు చేసిన మొత్తాలు సైతం అందే సూచనలు. బంధువుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కుటుంబసమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చి వాటినే అనుసరిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. భాగస్వాములు కొంత సహాయం అందిస్తారు. ఉద్యోగ విధి నిర్వహణలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఉన్నతాధికారుల చేయూత, సహకారం అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 11,12 తేదీల్లో పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
మీకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారే మిమ్మల్ని అనుసరించడం విశేషం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత కదలికలు కనిపిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని రుణాలు ఎట్టకేలకు తీరుస్తారు. స్థిరాస్తుల విక్రయాలు సకాలంలోనే పూర్తి చేసి కొంత సొమ్ము అందుతుంది. కుటుంబంలో మీపై అందరికీ గౌరవం పెరుగుతుంది. శుభకార్యాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాట పడతాయి. మొదట్లో కొంత ఒత్తిడులు ఎదురైనా సర్దుబాటు కాగలవు. ఉద్యోగాలలో .ఎదురుచూస్తున్న మార్పులు జరిగే అవకాశం. పనిఒత్తిడుల నుంచి కొంత ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగుతారు. 07,08 తేదీల్లో భూవివాదాలు ఆందోళన కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. రాబడి నిరాశ కలిగిస్తుంది. గణేశ్‌పూజలు మంచిది.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
ఎంతటి పని తలపెట్టినా ఇతరుల సహాయం లేకుండానే పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీ పట్ల విధేయత చూపుతారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. కొన్ని నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటారు. ఊహించని విధంగా ధనలాభ సూచనలు. ఆర్థిక పరమైన కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త సంస్థల్లోనూ పెట్టుబడులు పెడతారు. మీ ఆలోచనా విధానాలు అందరినీ ఆకట్టుకుంటాయి. సోదరులతో కొంతకాలంగా నెలకొన్న మనస్పర్థలు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మీదపడినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 09,10 తేదీల్లో వ్యవహారాలు ముందుకు సాగవు. తొందరపాటు మాటలతో ఆప్తులు దూరమవుతారు. ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి. అంగారక స్తోత్రాలు పఠించండి.
––––––––––––––––––––––––––––––––––