రాశిఫలాలు...15.06.25 నుండి 21.06.25 వరకు
పండగలు – పర్వదినాలు...
––––––––––––––––––----------------------
21, శనివారం, స్మార్త ఏకాదశి.
–––––––––––––––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో గందరగోళం తొలగుంది. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణాలు సైతం తీరతాయి. షేర్లలో కొత్త పెట్టుబడులకు సింసిద్ధులవుతారు. కుటుంబంలోని అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. మీపై వచ్చిన విమర్శలను ఎదుర్కొంటారు. సమర్థతను చాటుకుంటారు. సంతానం వివాహ సంబంధాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసివస్తాయి. రాజకీయవర్గాలు మరింత పురోగతి సాధిస్తారు. 18,19 తేదీల్లో కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. దేవాలయాల సందర్శనం. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన అగ్రిమెంట్లు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పొదుపు చర్యలు పాటించి ఖర్చులు అదుపు చేసుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తులపై పెట్టుబడి పెడతారు. కుటుంబంలోని అందరిలోనూ మీరంటే ఆదరణ,అభిమానం పెరుగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. తల్లితరఫు వారినుంచి కొంత లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో వ్యూహాలు అమలు చేసి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పదోన్నతులు లభించే సమయం. రాజకీయవర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 15,16 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఊహించని అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. రావలసిన డబ్బు చేతికందుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. భూముల కొనుగోలుపై కొంత వెచ్చిస్తారు. కుటుంబంలో మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకాగలవు. వ్యాపారాల విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు అప్రయత్నంగా అందుతాయి. ఉద్యోగుల్లో పదోన్నతి అవకాశాలు ఉంటాయి. బాధ్యతలు మరిన్ని పడవచ్చు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి ఉత్సాహాన్నిస్తాయి. 16,17 తేదీల్లో మిత్రులతో విరోధాలు. ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమాధిక్యం. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
సన్నిహితులు మరింత దగ్గరవుతారు. సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లబిస్తాయి. సహోద్యోగులు మీరంటే మరింత ఇష్టపడతారు. కళాకారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. 18,19 తేదీల్లో వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ఖర్చులు. రాబడిల తగ్గుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొన్ని వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. స్నేహితులతో నెలకొన్న తగాదాలు పరిష్కారం. పనులు నెమ్మదించినా సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. సంఘంలో మీ మాటకు ఎదురుండదు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇతరుల నుంచి సైతం రావలసిన డబ్బు అందుతుంది. ఆస్తుల విక్రయాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబంలోని అందరి ప్రేమ పొందుతారు. తల్లిదండ్రులు, సోదరీ,సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒకరి ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు. వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన నిందలు సమసిపోతాయి. పదోన్నతులు దక్కే అవకాశం. రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు. 19,20 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు. శ్రీదక్షిణామూర్తి ప్రార్ధన మంచిది.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ముఖ్యమైన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ప్రముఖులు పరిచయమైన మాటసాయం అందిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. బంధువర్గం నుంచి సైతం సాయం అందుతుంది. కుటుంబంలో మీ అంచనాలు నిజం కాగలవు. శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములు కాగలరు. వ్యాపారాలలో భాగస్వాములు చేరి పెట్టుబడులు పెంచుతారు. లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో పైస్థాయి అధికారుల మెప్పు పొందుతారు. విధుల్లో ఎక్కడా రాజీపడరు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 15,16 తేదీల్లో వృథా వ్యయం. మనశ్శాంతి లోపం. కొన్ని నిర్ణయాలు వాయిదా. శ్రీగణేశ స్తుతి చేయండి.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంగీతం, సాహిత్యంపై ఆసక్తి చూపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలోచనలు అమలుచేసి ముందుకు సాగుతారు. మిత్రుల నుంచి ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు,ఆభరణాలు కొంటారు. పెండింగ్బాకీలు వసూలవుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణబాధల నుంచి విముక్తి. షేర్లలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సద్దుమణుగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణ ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. 16,17 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో మార్పులు. గణేశ్స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పట్టుదలతో అనుకున్న విజయాలు సా«ధిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పొదుపు ద్వారా నిల్వ చేసిన సొమ్ము సకాలంలో అందుతుంది. రుణదాతల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తుల క్రయవిక్రయాలు లాభించి లబ్ధి పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వేడుకలు, ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెద్దల సలహాలు పాటిస్తూ ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో మరింత లాభాల కోసం యత్నిస్తారు. విస్తరణలో విజయం సాధిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. అందరిలోనూ గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. 17,18 తేదీల్లో మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీశివప్రార్ధన మంచిది.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగుల కృషి ఫలించదు. మానసిక ఆందోళన చెందుతారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. షేర్లలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. కుటుంబంలో మీ నిర్ణయాలపై వ్యతిరేకత ఎదురుకాగలదు. బంధువుల నుంచి విమర్శలు తప్పవు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం. అనుకున్న పదోన్నతులు ఆలస్యం. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. 16,17 తేదీల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దేవీస్తుతి మంచిది.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమైన సాయపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించిన విధంగానే డబ్బు అందుతుంది. అవసరాలకు లోటు ఉండదు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు. ఇతరుల వద్ద నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. కుటుంబంలోని అందర్నీ మెప్పించడంలో విజయం సాధిస్తారు. మీ ఆత్మీయత, ప్రేమ చూపుతూ ఆకట్టుకుంటారు. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాల బాటలో సాగుతారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. బాధ్యతలు కొంత తగ్గి ఉపశమనం పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 20,21 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రీ నృసింహధ్యానం మంచిది.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సొమ్ము అంది అవసరాలు తీరతాయి. స్థిరస్తులలో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలోని అందరి ప్రేమను చూరగొంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రమోష¯Œ అవకాశాలు ఉంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 18,19 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రీమహావిష్ణుధ్యానం మంచిది.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి ఊపిరిపీల్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులను మీదారికి తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. ఊహించని విధంగా కొంత సొమ్ము అందుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. సోదరులు,సోదరీలతో ఆనందాన్ని పంచుకుంటారు. వివాహాది వేడుకలకు సిద్ధమవుతారు. బంధువుల రాక మరింత ఉత్సాహాన్నిస్తుంది. వారితో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరుగుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం అందుకుంటారు. కళాకారులకు పురస్కారాలు రాగలవు. 19,20 తేదీల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. బంధువుల నుండి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రీవేంకటేశ్వరస్తుతి మంచిది.
–––––––––––––––––––––––––––––––