Observe Vayo Vratam: వయో వ్రతం ఎలా చేయాలి? లాభాలు ఏంటో తెలుసా?
లాభాలు ఏంటో తెలుసా?
Observe Vayo Vratam: వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.
ఫాల్గుణ మాసంలో వయో వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే ‘సర్వయజ్ఞ ఫలప్రదం’ అంటారు. అదితి దేవి తన కుమారులైన దేవతలకు తిరిగి స్వర్గరాజ్యం లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించిందట. అలా వామనుడిని పుత్రుడిగా పొందిందని పురాణ గాథ. కోరిన కోరికలు నెరవేరడానికి, సంతాన ప్రాప్తికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.
దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.