Goddess Lakshmi Won’t Stay: మీ పర్సులో ఇవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు.. అదృష్టం వరించాలంటే వాలెట్‌లో ఇవి ఉండాల్సిందే..
అదృష్టం వరించాలంటే వాలెట్‌లో ఇవి ఉండాల్సిందే..
Goddess Lakshmi Won’t Stay: పర్స్ లేదా వాలెట్ అంటే కేవలం డబ్బులు దాచుకునే సంచి మాత్రమే కాదు.. సనాతన ధర్మం ప్రకారం అది సంపదకు చిహ్నం. మన పర్సును మనం ఎలా ఉంచుకుంటాం అనే దానిపైనే మన ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అసలు పర్సులో ఏవి ఉండాలి? ఏవి ఉండకూడదు? గురూజీ చెప్పిన ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పర్సులో ఇవి అస్సలు ఉండకూడదు!
చాలామంది పర్సులో రకరకాల కాగితాలు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇవి నెగటివ్ ఎనర్జీని తెస్తాయి:
మందులు - ప్రిస్క్రిప్షన్లు: పర్సులో మందులు లేదా డాక్టర్ చిట్టీలు ఉంచడం వల్ల అనారోగ్యం, ఆర్థిక నష్టం కలుగుతాయి.
కోర్టు పత్రాలు - అప్పుల చిట్టా: కోర్టు కేసులకు సంబంధించిన కాగితాలు లేదా ఎవరికైనా ఇవ్వాల్సిన అప్పుల లిస్టు పర్సులో ఉంటే పేదరికం దరిచేరుతుంది.
చిరిగిన పర్సు: చిరిగిన లేదా పాడైపోయిన పర్సును వాడటం అరిష్టం. ఇది ధన ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.
నోట్లను మడతపెట్టకండి: డబ్బును నలిపి లేదా మడతపెట్టి ఉంచడం అశుభం. నోట్లను ఎప్పుడూ నిటారుగా, పద్ధతిగా అమర్చుకోవాలి.
2. ఫొటోలు ఎక్కడ ఉండాలి?
మరణించిన కుటుంబ సభ్యుల ఫొటోలను నేరుగా డబ్బులు ఉంచే అరలో ఉంచకూడదు. ఒకవేళ ఫొటోలు ఉంచుకోవాలనుకుంటే పర్సులోని పై భాగంలో లేదా వేరే కంపార్ట్‌మెంట్‌లో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
సంపదను ఆకర్షించే చిట్కాలు:
మీ పర్సు ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే ఇవి పాటించండి:
నాణేల శక్తి: పర్సులో ఎప్పుడూ ఒకటి లేదా రెండు నాణేలు ఉండేలా చూసుకోండి. ఇది లక్ష్మిని ఆకర్షిస్తుంది.
లక్కీ నోటు: ఖర్చు చేయకుండా ఒక వంద రూపాయల నోటును పర్సులో అలాగే ఉంచండి. ఇది ధన ప్రవాహం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
పాత నాణేలు: పూర్వీకుల కాలం నాటి పాత నాణేలు లేదా పాత నోట్లను ఉంచుకోవడం శుభప్రదం.