Inauspicious for Children to Be Born in Adhika Masa: అధిక మాసంలో పిల్లలు పుడితే దోషమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు నిజాలు ఇవే..
శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు నిజాలు ఇవే..
Inauspicious for Children to Be Born in Adhika Masa: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనకు అధిక మాసం నడుస్తోంది. అయితే, ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదనే నియమం ఉండటంతో... చాలా మందిలో "అధిక మాసంలో పిల్లలు పుట్టడం మంచిదేనా? దీనివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా?" అనే సందేహాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అపోహలపై ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శాస్త్రోక్తంగా వివరణ ఇస్తూ, ఈ మాసంలో జన్మించే పిల్లల విశిష్టతను వెల్లడించారు.
అధిక మాసం అంటే ఏమిటి?
అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఇది సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల. "అధికస్య అధిక ఫలం" అనే నానుడి ప్రకారం.. ఈ మాసంలో చేసే జపాలు, తపస్సులు, దానధర్మాలకు సాధారణ రోజుల కంటే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. ఇంతటి పవిత్రమైన మాసంలో పిల్లలు జన్మించడం ఎంతో శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
అధిక మాసంలో పుట్టిన పిల్లల లక్షణాలు, భవిష్యత్తు..
ఈ పవిత్ర మాసంలో జన్మించిన పిల్లలకు ప్రత్యేక ప్రతిభ, అదృష్టం ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వారు పుట్టిన వారాలను బట్టి వారి స్వభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి..
సోమ, బుధ, శనివారాల్లో పుట్టిన వారు:
ఈ రోజుల్లో జన్మించిన పిల్లలు అత్యంత తెలివైనవారుగా, సమయస్ఫూర్తి గలవారుగా ఉంటారు. ఏ విషయానైనా చాలా త్వరగా గ్రహించే అద్భుతమైన జ్ఞాపకశక్తి వీరికి ఉంటుంది.
మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో పుట్టిన వారు:
ఈ రోజుల్లో జన్మించిన పిల్లలలో సహనం, ఓర్పు చాలా ఎక్కువగా ఉంటాయి. తాబేలు-నక్క కథలో తాబేలు తన ఓర్పుతో విజయం సాధించినట్లుగా... వీరు కూడా జీవితంలో ఎంతటి కష్టాలనైనా ఓపికతో ఎదుర్కొని అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు:
పురుషోత్తమ మాసంలో జన్మించిన పిల్లలు స్వయం సమృద్ధిని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు.
వీరికి నాయకత్వ లక్షణాలు, పరిపాలనా సామర్థ్యం పుట్టుకతోనే వస్తాయి.
భవిష్యత్తులో వీరు ఉన్నత విద్యావంతులై.. వైద్యులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, లేదా IAS, IPS వంటి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎలాంటి పరిహారాలు అవసరం లేదు.
అధిక మాసంలో పిల్లలు పుడితే దోషం అని భావించడం కేవలం భ్రమ మాత్రమే. ఈ మాసంలో జన్మించిన పిల్లలకు ఎలాంటి గ్రహ దోషాలు లేదా లోపాలు ఉండవు. కాబట్టి వీరి కోసం ఎలాంటి ప్రత్యేక శాంతి పూజలు, దోష నివారణ యజ్ఞాలు చేయించాల్సిన అవసరం లేదు.