Sade Sati Always Unlucky: ఏలినాటి శని ఎప్పుడూ దురదృష్టమేనా? శని దేవుడు నేర్పే జీవిత పాఠాలు ఇవే..
శని దేవుడు నేర్పే జీవిత పాఠాలు ఇవే..
Sade Sati Always Unlucky: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫల దాత అని పిలుస్తారు. అంటే మనం చేసే మంచి, చెడు కర్మలను బట్టి ఆయన ఫలితాలను ఇస్తారు. ఒక వ్యక్తి రాశికి ముందు రాశి, స్వరాశి, తర్వాతి రాశిలో శని సంచరించే 7న్నర సంవత్సరాల కాలాన్నే ఏలినాటి శని అంటారు.
సాధారణంగా ఏలినాటి శని అంటేనే ఏదో జరిగిపోతుందనే భయం ప్రజల్లో ఉంది. కానీ వాస్తవానికి ఈ కాలం కేవలం కష్టాలను ఇచ్చేది కాదు, ఒక వ్యక్తిని మానసికంగా, ఆధ్యాత్మికంగా పరిపక్వం చేసే అద్భుతమైన కాలం.
ఏలినాటి శని ఎందుకు ఎల్లప్పుడూ కీడు చేయదు?
నిజమైన మిత్రులను గుర్తిస్తుంది:
ఈ కాలంలో ఎదురయ్యే సవాళ్లు, మీ కష్టాల్లో మీతో పాటు నిలిచే నిజమైన స్నేహితులు, బంధువులు ఎవరో మీకు స్పష్టంగా చూపిస్తాయి.
క్రమశిక్షణ, సహనం:
శని దేవుడు కష్టపడే తత్వాన్ని, క్రమశిక్షణను, ఓర్పును నేర్పుతాడు. ఈ కాలంలో నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి.
అహంకారాన్ని తొలగిస్తుంది:
వ్యక్తిలో ఉండే అహంకారాన్ని, గర్వాన్ని అణచివేసి, జీవితంలో భూమిపై నడవడం ఎలాగో శని నేర్పుతాడు.
రాజయోగం కూడా సాధ్యమే:
జాతకంలో శని గ్రహం బలమైన స్థానంలో ఉంటే, ఏలినాటి శని కాలంలోనే కొందరికి అపారమైన కీర్తి, పదవులు, వ్యాపారంలో ఊహించని లాభాలు కూడా కలుగుతాయి.
-శని ప్రభావం సానుకూలంగా మారాలంటే ఏం చేయాలి?
ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కష్టాల తీవ్రత తగ్గి, శని దేవుని అనుగ్రహం లభించాలంటే ఈ క్రింది మార్గాలను అనుసరించవచ్చని పండితులు పేర్కొంటున్నారు..
సత్యం, ధర్మం పాటించడం:
శని దేవుడు న్యాయాధికారి. కాబట్టి ఎవరినీ మోసం చేయకుండా, నిజాయితీగా ఉండేవారికి ఆయన ఎప్పుడూ హాని చేయడు
సేవాభావం:
పేదలకు, వృద్ధులకు, శారీరక వికలాంగులకు మీ శక్తానుసారం సహాయం చేయడం వల్ల శని దోష తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
హనుమాన్ ఆరాధ:
శని దేవుడికి, హనుమంతునికి మధ్య ఉన్న ప్రత్యేక బంధం వల్ల, ఎవరైతే రోజూ 'హనుమాన్ చాలీసా' పఠిస్తారో వారిని శని బాధించడు.
శనివార నియమాలు:
శనివారం నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె దానం చేయడం లేదా శని దేవునికి తైలాభిషేకం చేయడం మంచిది.