Marriage Getting Delayed: పెళ్లి ఆలస్యం అవుతుందా? వారాహి నవరాత్రులలో ఈ చిన్న పరిహారాలు చేయండి
ఈ చిన్న పరిహారాలు చేయండి
Marriage Getting Delayed: ఆషాఢ మాసంలో వచ్చే 'వారాహి నవరాత్రులు' లేదా 'గుప్త నవరాత్రులకు' మన సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. మనస్సులో ఏ కోరికతో ఈ తొమ్మిది రోజులు శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధించినా, ఆ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో పదే పదే ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి ఈ నవరాత్రులు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తాయి.
వివాహ బంధానికి ఎదురవుతున్న గ్రహ దోషాలను తొలగించడానికి అమ్మవారికి చేసే కొన్ని పూజలు శ్రేష్ఠమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా నవరాత్రులలో ప్రతిరోజూ లేదా ముగింపు రోజున సాయంత్రం సమయంలో శ్రీ కాత్యాయనీ దేవి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. 'కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరి' అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, శీఘ్ర వివాహ ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే, నవరాత్రుల ముగింపు రోజున శివపార్వతులను భక్తితో ఆరాధించడం ఎంతో శుభకరం. పసుపుకొమ్ములను శివపార్వతులకు సమర్పించి, ఆపై వేద బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా దాంపత్య దోషాలు తొలగిపోతాయి. లేదా శివపార్వతుల విగ్రహం చుట్టూ ఏడుసార్లు యజ్ఞోపవీతాన్ని ముడివేసి పూజించడం ద్వారా అను అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు
పెళ్లి సంబంధాలు నిశ్చయం కాక ఇబ్బంది పడేవారు దుర్గా సప్తశతిలోని 'అర్గల స్తోత్రాన్ని' పఠించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు, సుమంగళీలకు గాజులు, కుంకుమ, గోరింటాకు, ఎరుపు రంగు వస్త్రాలు లేదా చీర వంటి సౌభాగ్య ద్రవ్యాలను దానం చేయడం ద్వారా వారాహి దేవి కరుణాకటాక్షాలు లభిస్తాయి