Pitru Paksha: పితృ పక్షానికి ముందు ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు ఇవే!

ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువులు ఇవే!;

Update: 2025-08-25 16:37 GMT

Pitru Paksha: పితృ పక్షం అనేది పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు సమర్పించడానికి అత్యంత ముఖ్యమైన కాలం. ప్రతి సంవత్సరం 16 రోజుల పాటు ఉండే ఈ పితృ పక్ష సమయంలో పూర్వీకులు భూమిపైకి వచ్చి వారి వారసుల ఇళ్లలో ఉంటారని మత విశ్వాసాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పవిత్రమైన వాతావరణాన్ని నెలకొల్పడం చాలా అవసరం. పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే, పితృ పక్షం ప్రారంభమయ్యే ముందు కొన్ని వస్తువులను ఇంటి నుంచి తొలగించడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వస్తువులను వెంటనే తొలగించండి

విరిగిన పాత్రలు: ఇంట్లో విరిగిన లేదా పగిలిన పాత్రలు ఉంచడం అశుభమని, ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. పితృ పక్షానికి ముందు వీటిని తొలగించడం వల్ల ఆర్థిక సంక్షోభం, దురదృష్టం దూరమవుతాయని చెబుతున్నారు.

పగిలిన విగ్రహాలు, చిరిగిన ఫోటోలు: ఏదైనా దేవుడి విగ్రహం పగిలిపోయినా లేదా చిత్రం చిరిగిపోయినా వాటిని వెంటనే తొలగించాలి. అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచడం అశుభం. వాటిని నదిలో నిమజ్జనం చేయడం లేదా చెట్టు కింద ఉంచడం మంచిది.

ఆగిపోయిన గడియారం: వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారం జీవిత గమనం, పురోగతికి చిహ్నం. ఆగిపోయిన లేదా పగిలిన గడియారం ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది. కుటుంబ సభ్యుల పురోగతికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి, పితృ పక్షానికి ముందు దాన్ని రిపేరు చేయించాలి లేదా ఇంటి నుంచి తీసివేయాలి.

ఎండిన మొక్కలు: ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. పితృ పక్ష సమయంలో వీటిని ఇంట్లో ఉంచడం మంచిది కాదు. పితృ పక్షం మొదలయ్యేలోపు ఈ మొక్కలను తొలగించి, కొత్త పచ్చని మొక్కలను నాటడం శుభప్రదం.

తుప్పు పట్టిన వస్తువులు: ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు, విరిగిన ఫర్నిచర్, లేదా ఉపయోగించని వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. పితృ పక్షానికి ముందు ఈ వస్తువులను ఇంటి నుంచి తొలగించడం వల్ల మంచి జరుగుతుంది.

Tags:    

Similar News