Keeping Matchsticks in the Prayer Room: పూజా గదిలో అగ్గిపెట్టె ఉంచుతున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయకండి!

ఈ తప్పు అస్సలు చేయకండి!

Update: 2026-03-25 07:49 GMT

Keeping Matchsticks in the Prayer Room: ఇంట్లో అత్యంత పవిత్రమైన, సానుకూల శక్తికి నిలయమైన ప్రదేశం పూజా గది. అందుకే దేవాలయం లేదా పూజా గది విషయంలో మనం అనేక నియమాలను పాటిస్తుంటాం. అయితే, మనకు తెలియకుండానే చేసే ఒక చిన్న తప్పు ఇంటి శాంతికి, ఆర్థిక స్థితికి భంగం కలిగిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే అగ్గిపెట్టెలను పూజ గదిలో ఉంచడం.

అగ్గిపెట్టె ఎందుకు ఉంచకూడదు?

సాధారణంగా దీపారాధన లేదా అగరబత్తులు వెలిగించడానికి మనం అగ్గిపెట్టెలను వాడుతుంటాం. సౌకర్యం కోసం చాలామంది వాటిని దేవుడి పటాల పక్కనే లేదా గుడిలోనే ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం..

శక్తి సంఘర్షణ: పూజా గది శాంతి మరియు సాత్విక తత్వానికి ప్రతీక. అగ్గిపెట్టె అగ్ని తత్వానికి సంకేతం. పవిత్రమైన విగ్రహాల వద్ద వీటిని ఉంచడం వల్ల ఆ ప్రదేశంలోని సానుకూల శక్తి తగ్గుతుంది.

వాస్తు దోషం: పూజా గదిలో మండే వస్తువులను బహిరంగంగా ఉంచడం వల్ల 'వవాస్తు దోషం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మనం చేసే పూజల పూర్తి ఫలితాన్ని అడ్డుకుంటుంది.

ప్రతికూల ప్రభావం: దీనివల్ల ఇంట్లో అనవసరమైన మనస్పర్థలు, మానసిక అశాంతి మరియు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నమ్ముతారు.

పడకగదిలో కూడా జాగ్రత్త..

పూజా గదిలోనే కాకుండా, పడకగదిలో కూడా కొవ్వొత్తులు లేదా అగ్గిపెట్టె వంటి వస్తువులను ఉంచడం నిషిద్ధం. ఇది భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీస్తుందని, వైవాహిక జీవితంలో ఆందోళనలను పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

పరిష్కారం ఏమిటి?

ఒకవేళ మీరు పూజా గదిలోనే అగ్గిపెట్టెను ఉంచాల్సి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

కనిపించకుండా ఉంచండి: అగ్గిపెట్టెలను దేవుడి పటాల ముందు కాకుండా, మూసి ఉన్న డ్రాయర్‌లో లేదా అల్మారాలో ఉంచండి.

వస్త్రంతో కప్పండి: ఒకవేళ బయట ఉంచాల్సి వస్తే, దాన్ని ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.

చిన్న మార్పులే అయినా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నిపుణుల సూచన.

Tags:    

Similar News