Devotional: కేతువు - బుధుడు కలయిక.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..;

Update: 2025-06-06 11:18 GMT

Devotional:జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్తాయి. అదేవిధంగా అగష్టులో కేతువు - బుధుడు ఒక సంయోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. ఈ కలయిక కొన్ని రాశులకు అదృష్టం తెస్తుంది. మూడు రాశుల వారికి చాలా సంపద, పురోగతి ఉంటుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి బుధుడు - కేతువు కలయిక లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది.పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. ఆదాయ వనరు పెరుగుతుంది. ఒక యాత్రలకు కూడా వెళ్ళవచ్చు. కుటుంబంలో అందరి సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీలో ఆనందం, శాంతి నెలకొంటుంది.

సింహం

కేతువు - బుధల కలయిక సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి అదృష్టం యోగం ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో పురోగతితో పాటు, గొప్ప ఆర్థిక లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంబంధాలు బలోపేతం అవుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కేతువు - బుధుడు కలయిక చాలా శుభప్రదం. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఉపాధి లభిస్తుంది. ప్రమోషన్లు దక్కే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.

Tags:    

Similar News