Lakshmi Narayana Yoga: మే 29 నుండి లక్ష్మీ నారాయణ యోగం.. ఈ 4 రాశుల వారికి అపార సంపద, అదృష్టం..
ఈ 4 రాశుల వారికి అపార సంపద, అదృష్టం..
Lakshmi Narayana Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. గ్రహాల ఈ సంచార క్రమంలో జాతక చక్రంలో కొన్ని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మే నెలాఖరులో బుధ గ్రహ సంచారం కారణంగా అంత్యంత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం ప్రారంభం కాబోతోంది.
బుధుడు మే 29న మిథున రాశిలోకి ప్రవేశించి, జూన్ 8 వరకు అక్కడే ఉంటాడు. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం.. బుధుడి ఈ సంచార కాలంలో ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో సంపద, అదృష్టం, సంతోషం రెట్టింపు అవ్వబోతున్నాయి. ప్రధానంగా ఈ క్రింది నాలుగు అదృష్ట రాశుల వారికి ఈ యోగం ఊహించని ఆర్థిక లాభాలను, అపూర్వమైన కెరీర్ విజయాన్ని అందించబోతోంది. ఆ రాశుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ 4 రాశుల జీవితాల్లో గోల్డెన్ పీరియడ్..
మిథున రాశి..
లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ఇవ్వబోతోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభాలు ఊహించని విధంగా పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుండి మంచి ఆదాయం వస్తుంది. అప్పుల సమస్యలు క్రమంగా తగ్గిపోయి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. వీరికి సుదూర ప్రయాణ యోగం కూడా ఉంది.
సింహ రాశి
ఈ యోగం సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త బాధ్యతలతో పాటు మంచి జీతంతో కూడిన కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు తమ బిజినెస్‌ను విస్తరించుకోవడానికి ఇది అత్యంత ఉత్తమమైన సమయం. పని ప్రదేశంలో మీ గౌరవ మర్యాదలు, గుర్తింపు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి, ఆదాయ వనరులు పెరుగుతాయి.
కన్యా రాశి..
లక్ష్మీ నారాయణ యోగం కన్యారాశి వారి వృత్తి జీవితంలో ఒక పెద్ద సానుకూల మలుపు తిప్పబోతోంది. ఉద్యోగంలో పురోగతి, ఆశించిన జీతం పెరుగుదల, సమాజంలో ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై విజయవంతమవుతాయి. విదేశాలలో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం ఎంతగానో అనుకూలిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన విజయాలను అందుకుంటారు. పూర్తి ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది.
తులా రాశి
తులారాశి వారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న మానసిక, శారీరక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత బాకీలు, అప్పులను సులభంగా తీర్చగలుగుతారు. కొత్త ఇల్లు లేదా కారు, వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. కుటుంబంలో ఇన్నాళ్లూ ఉన్న గొడవలు సర్దుమణిగి సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి మార్గం సుగమం అవుతుంది.