Markandeya: మృకండ మహర్షి, ఆయన భార్య సంతానం కోసం పరమశివుడిని ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. తక్కువ ఆయుష్షు కలిగిన గొప్ప జ్ఞానవంతుడైన కుమారుడు కావాలా? ఎక్కువ కాలం జీవించే సాధారణ కుమారుడు కావాలా? అని అడిగాడు.

దీంతో వారు తక్కువ ఆయుష్షు ఉన్నా గొప్ప గుణాలు కలిగిన కుమారుడినే కోరుకున్నారు. అలా జన్మించిన మార్కండేయుడు చిన్నతనం నుంచే శివభక్తిలో మునిగిపోయాడు. అయితే అతడికి కేవలం 16 సంవత్సరాల ఆయుష్షు మాత్రమే ఉందని తల్లిదండ్రులకు తెలుసు.

16వ ఏటకు చేరుకున్న మార్కండేయుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు యమధర్మరాజు వచ్చాడు. ఆ సమయంలో బాలుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని పరమశివుడిని ప్రార్థిస్తున్నాడు. యముడు తన పాశాన్ని విసరగా అది శివలింగానికి కూడా చుట్టుకుంది.

దీంతో ఆగ్రహించిన పరమశివుడు లింగం నుంచి ప్రత్యక్షమై యముడిని అడ్డుకున్నాడు. మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించినట్లు పురాణ కథనం చెబుతోంది.

మృత్యువును కూడా ఎదిరించిన మార్కండేయుడి భక్తి కథ తరతరాలుగా ప్రజలను ఆకట్టుకుంటోంది. నమ్మకం, అచంచలమైన భక్తి, ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.

Tags: