Mars and Mercury Conjunction in Revati Nakshatra: రేవతి నక్షత్రంలో కుజ, బుధుల కలయిక.. ఈ మూడు రాశుల వారికి ఇక తిరుగుండదు..

ఈ మూడు రాశుల వారికి ఇక తిరుగుండదు..

Update: 2026-04-23 12:59 GMT

Mars and Mercury Conjunction in Revati Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, నక్షత్ర మార్పులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏప్రిల్ నెలలో ఒక అద్భుతమైన ఖగోళ మార్పు చోటుచేసుకోబోతోంది. పంచాంగం ప్రకారం.. ఏప్రిల్ 22న జ్ఞానకారకుడైన బుధుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించగా.. ఏప్రిల్ 24న ధైర్యానికి అధిపతి అయిన కుజుడు కూడా సేమ్ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృత్తి, వ్యాపార, కుటుంబ విషయాల్లో వీరికి తిరుగులేని విజయాలు లభించనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి: ఆర్థిక స్థిరత్వం - అద్భుత అవకాశాలు

మేష రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూల శక్తిని అనుభవిస్తారు. కార్యాలయంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్, విద్యారంగాల్లో ఉండేవారికి ఇది గోల్డెన్ పీరియడ్. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా స్థిరపడతారు. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఇది విజయాల సమయం. మీ చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయం. సామాజిక హోదా పెరుగుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోపం, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. సహనంతో వ్యవహరిస్తేనే అదృష్టం మీ వెంటే ఉంటుంది.

మీన రాశి:

రేవతి నక్షత్రంలో ఈ యుతి జరగడం వల్ల మీన రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. గతంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి.

ఈ సమయంలో మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తాయి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి.

Tags:    

Similar News