Mercury Enters Vishakha Nakshatra: జ్యోతిషశాస్త్రంలో బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడైన బుధ గ్రహ గోచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు నిర్దిష్ట కాల వ్యవధిలో తమ రాశులను, నక్షత్రాలను మారుస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్న బుధుడు.. స్వాతి నక్షత్రం నుంచి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవ్వడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం..

కర్కాటక రాశి

బుధ గ్రహ నక్షత్ర సంచారం కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తున్న వారికి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి దక్కే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు క్రమంగా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి కావడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ బుధ సంచారం అత్యంత శుభ ఫలితాలను, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రతిభకు తగిన గుర్తింపు, జీతాల పెంపు లేదా ప్రమోషన్లు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారవేత్తలకు పెద్ద మొత్తంలో నూతన కాంట్రాక్టులు, ఆర్డర్లు లభించి లాభాల బాట పడతారు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన భాగస్వామి దొరుకుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ కాలం మానసిక ప్రశాంతతను, శుభ పరిణామాలను అందిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది జీవితంలో స్పష్టతను, ప్రశాంతతను తెస్తుంది. తోబుట్టువుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, అనుబంధం మరింత బలపడతాయి. సంతానం చదువు, కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. వారి విజయాలు కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags: