Ontimitta Sri Kodandaramaswamy: కాళీయమర్దన అలంకారంలో రామచంద్రుని కరుణామృతం

రామచంద్రుని కరుణామృతం

Update: 2026-04-04 02:36 GMT

Ontimitta Sri Kodandaramaswamy: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు కాళీయమర్దన అలంకారంలో భక్తులను కటాక్షించారు.

ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవలో భజన బృందాలు భక్తిరసభరితంగా భజనలు, కోలాటాలు నిర్వహించగా, స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆనందింపజేశారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, సూపరింటెండ్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్‌తో పాటు పలువురు అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News