Powerful Lakshmi Narayan Yoga: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ 26న సంభవించిన భాద్రపద పౌర్ణమి పర్వదినాన బుధ, శుక్ర గ్రహాల కలయికతో తులారాశిలో అత్యంత శుభప్రదమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. బుద్ధి, జ్ఞానానికి కారకుడైన బుధుడు.. సంపద, విలాసాలకు ప్రతీక అయిన శుక్రుడితో కలవడం వల్ల ఏర్పడిన ఈ అరుదైన యోగం రాబోయే 40 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ప్రభావంతో ప్రధానంగా ఆరు రాశుల వారికి అపారమైన ధనలాభం, కెరీర్‌లో అద్భుత ఎదుగుదల, సర్వతోముఖాభివృద్ధి కలగనున్నాయి.

ఆ 6 రాశుల ఫలితాలు ఇవే:

మేష రాశి

ఈ రాశికి ఏడవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుండటంతో భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి విశేష లాభాలు అందుతాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించి, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఖరారవుతుంది. కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ 40 రోజులు ఎంతో అనుకూల సమయం.

మిథున రాశి

రాశ్యాధిపతి బుధుడు ఐదవ ఇంట్లో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మీ మేధస్సుకు సరైన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు బోనస్‌లు, ఇంక్రిమెంట్ల రూపంలో పొదుపు భారీగా పెరుగుతుంది.

కన్య రాశి

ధన స్థానమైన రెండవ ఇంట్లో ఈ కలయిక జరుగుతుండటంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలపడుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి బహుళజాతి సంస్థల నుంచి ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఆఫర్లు వస్తాయి. సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తు కోసం లాభాలు ఆర్జిస్తారు.

తుల రాశి

తులారాశి లగ్నంలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుండటంతో సమాజంలో మీ గౌరవ మర్యాదలు, పరపతి అమాంతం పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలతో ఆఫీసులో కీలక ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తారు. వ్యాపారస్తులకు నూతన కాంట్రాక్టులు దక్కగా, ఉద్యోగులకు వేతన పెంపునకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి.

ధనుస్సు రాశి

లాభ స్థానమైన పదకొండవ ఇంట్లో బుధ-శుక్రుల కలయిక ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం, ఆశించిన ప్రమోషన్ లభిస్తాయి.

కుంభ రాశి

భాగ్య స్థానమైన తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ప్రభావం వల్ల కెరీర్‌లో ఊహించని మలుపులు ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం, పరిచయాలతో సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. జాబ్ ఇంటర్వ్యూలలో విజయం సాధించి ఆర్థిక ఉన్నతిని చూస్తారు.

Tags: