Powerful Mantra of Kali Yuga: కలియుగంలో మానవులు చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేక అశాంతికి గురవుతున్నారు. మానసిక ప్రశాంతత కరువవడం, జ్ఞానం, తెలివితేటలు మందగించడం నేడు సర్వసాధారణమైపోయింది. అయితే, మన పురాణాలలో, వేదాలలో ఇలాంటి సమస్త బాధల నుంచి విముక్తి పొందేందుకు ఎన్నో మార్గాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా యజుర్వేదంలో పేర్కొన్న ఓ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో పఠిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. అదే మహాశివునికి సంబంధించిన పంచాక్షరీ మంత్రం!

అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం లాంటిది "ఓం నమశ్శివాయ" అనే పంచాక్షరీ మహామంత్రం. యజుర్వేదంలోని రుద్రాధ్యాయం నుంచి ఉద్భవించిన ఈ మంత్రం పఠించడం వల్ల మనిషిలో చిత్తశుద్ధి, అపారమైన జ్ఞానప్రాప్తి కలుగుతాయి.

ఈ మంత్రంలో 'ఓం'తో కలిపి మొత్తం ఆరు అక్షరాలు ఉంటాయి. ఆదిలో ఉండే 'ఓం'కారానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది మంత్రానికి శిరస్సు లాంటిది. ఓంకార పూర్వకంగా 'నమశ్శివాయ' అనే పంచాక్షరిని భక్తితో ఉచ్చరిస్తే చాలు... దాని అర్థం పూర్తిగా తెలియకపోయినా విశేషమైన ఫలితం దక్కుతుంది.

పురాణాల ప్రకారం, ఒకసారి శివభక్తులైన సౌనందగణేశ మునివర్యులు యమలోకానికి వెళ్లిన సందర్భంలో... ఈ నామస్మరణ చేసేవారికి లభించే పుణ్యఫలాలు ఏమిటో స్పష్టమవుతాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళనలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ కొంత సమయాన్ని భగవన్నామ స్మరణకు కేటాయించాలి.

నియమ నిష్టలతో, ఏకాగ్రతతో ఈ మహా మంత్రాన్ని జపించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మనిషిలో తెలివితేటలు పెరుగుతాయి. కేవలం జ్ఞానమే కాకుండా, సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వెతుక్కుంటూ వస్తాయి.

Tags: