Rahu Transit 2026: రాహు గోచారం 2026: కుంభరాశిలో రాహువు సంచారం.. నవంబర్ వరకు ఈ 4 రాశుల వారికి తీవ్ర మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టాలు తప్పవా..
నవంబర్ వరకు ఈ 4 రాశుల వారికి తీవ్ర మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టాలు తప్పవా..
Rahu Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో పాప గ్రహంగా, ఛాయా గ్రహంగా పిలవబడే రాహువు సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు లేదా నక్షత్ర సంచారం చేసినప్పుడు ద్వాదశ రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు వస్తుంటాయి. తాజాగా రాహువు కుంభరాశిలోని శతభిషం నక్షత్రంలోకి ప్రవేశించాడు.
ప్రస్తుతం రాహువు కుంభరాశిలోనే ఉన్నాడు. రాహువు ఆగస్టు 2 వరకు ఈ నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత నవంబర్ 25 వరకు కుంభరాశిలోనే కొనసాగనున్నాడు. ఈ అరుదైన గ్రహ సంచారం వల్ల కుంభరాశితో పాటు మరో 4 రాశుల వారికి పెద్ద ఎత్తున సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అశుభ రాశులు ఏవో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి: అపార్థాలు.. ఆర్థిక ఇబ్బందులు
రాహువు నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో తగాదాలు, గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాల వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. వివాహితులు తమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అపార్థాలకు తావివ్వకూడదు. ఈ సమయంలో ధన నష్టం లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపాటుతో ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు, ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు.
కర్కాటక రాశి: ఉద్యోగంలో ఒత్తిడి.. వ్యాపారంలో నష్టాలు
కర్కాటక రాశి వారికి ఈ కాలం కొంత పరీక్షా సమయమనే చెప్పాలి. ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల మానసిక అలసట చెందుతారు. స్థిరాస్తి లేదా భూములకు సంబంధించిన విషయాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. బిజినెస్ చేసే వారికి ఆర్థిక పరంగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఆత్మనిగ్రహం, సహనం చాలా అవసరం.
సింహ రాశి: పెరిగే ఖర్చులు.. పిల్లల గురించిన ఆందోళన
సింహ రాశి వారు ఈ రాహు గోచార సమయంలో కుటుంబ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వల్ల మీ మంత్లీ బడ్జెట్ దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా వచ్చే కొన్ని అడ్డంకులు చికాకు కలిగిస్తాయి. పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని వేధిస్తాయి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తెలివిగా తీసుకోవాలి.
వృశ్చిక రాశి: పనుల్లో జాప్యం.. అస్థిరత
వృశ్చిక రాశి వారు ఈ కాలంలో జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఆఫీసులో లేదా చేతిలో ఉన్న ప్రాజెక్టులు సమయానికి పూర్తి కాకపోవడంతో తీవ్ర అసహనానికి, చికాకుకు గురవుతారు. వ్యాపారవేత్తలకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మేలు. ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆందోళన చెందుతారు. ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది.