Rajayogam in Aries: అదృష్టం అంటే వీరిదే.. మేషరాశిలో రాజయోగం.. ఆ 4 రాశుల వారికి కాసుల వర్షం

మేషరాశిలో రాజయోగం.. ఆ 4 రాశుల వారికి కాసుల వర్షం

Update: 2026-04-17 14:59 GMT

Rajayogam in Aries: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని మారుస్తుంటాయి. ప్రస్తుతం కళలకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఇప్పటికే మేషరాశిలో సంచరిస్తుండగా.. ఏప్రిల్ 17న బుద్ధికి, మనస్సుకు కారకుడైన చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించాడు. ఈ ఇద్దరు శుభ గ్రహాల కలయిక వల్ల వైభవ్ లక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ అరుదైన రాజయోగం కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాలు మారిపోనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే..

మేష రాశి : విజయాల పరంపర

మేష రాశిలోనే ఈ యోగం ఏర్పడటం వల్ల వీరికి ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు, ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావడం వల్ల, ఈ సంయోగం వీరికి అమితమైన లాభాలను తెచ్చిపెడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి రెట్టింపు లాభాలు గడిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని విజయవంతంగా బ్యాలెన్స్ చేస్తారు.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ కాలం అన్ని రంగాల్లోనూ అఖండ విజయాన్ని అందిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఘనవిజయం సాధిస్తారు. కెరీర్ పరంగా కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శత్రు బాధలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో తిరుగులేని ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు లేదా వేతన పెంపు ఉండే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు గరిష్ట లాభాలు వచ్చే సమయం ఇది. పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఉత్సాహంగా పని చేస్తారు.

Tags:    

Similar News