Rare Solar Eclipse on August 12: ఆగస్టు 12న అరుదైన సూర్యగ్రహణం.. ఈ రాశుల జాతకం మారిపోనుంది, ధన లాభ యోగం..
ధన లాభ యోగం..
Rare Solar Eclipse on August 12: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఖగోళంలో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకోబోతోంది. ఆగస్టు 12, 2026న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, గ్రహాల అమరిక వల్ల ఏర్పడే శక్తులు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సుతక్ కాలం ఉంటుందా? అలాగే ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి విశేషమైన అదృష్టం, ధన లాభం లభించబోతుందో ఇక్కడ వివరంగా చూద్దాం..
భారతదేశంపై గ్రహణ ప్రభావం ఎంత?
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ సూర్యగ్రహణం ప్రధానంగా ఐరోపా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం పాక్షికంగా కూడా కనిపించదు .
భారత్‌లో గ్రహణం దృశ్యమానం కాదు కాబట్టి ఇక్కడ సూత కాలం వర్తించదు. దేవాలయాల తలుపులు మూసివేయడం లేదా పూజాది కార్యక్రమాలు నిలిపివేయాల్సిన అవసరం ఉండదని పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఖగోళ రీత్యా సూర్యుడు, రాహు-కేతువుల సంచారం వల్ల గ్రహణ ప్రభావం రాశిచక్రంపై ఖచ్చితంగా ఉంటుంది.
సూర్యగ్రహణంతో బంపర్ యోగం పొందే అదృష్ట రాశులు:
మేష రాశి
మేష రాశి వారికి ఈ సూర్యగ్రహణం అత్యంత శుభప్రదంగా మారనుంది. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వేతనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుండి ఊరట లభించి, నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి.
సింహ రాశి
సూర్యభగవానుడు సింహ రాశికి అధిపతి కావడంతో ఈ గ్రహణం తర్వాత వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు, హోదా పెరుగుతాయి. వ్యాపారంలో ఊహించని భారీ లాభాలు అందుతాయి. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు గ్రహణం తర్వాత భాగ్య స్థానం బలపడుతుంది.
ఆకస్మిక ధన లాభం పొందే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు లేదా ఉద్యోగ యత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి గత కొన్ని నెలలుగా ఉన్న మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త ప్రాజెక్టులు, వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి.
గ్రహణ సమయంలో పాటించాల్సిన సాధారణ నియమాలు..
భారతదేశంలో సూత కాలం లేకపోయినప్పటికీ, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం గ్రహణ సమయంలో:
మంత్ర జపం: "ఓం సూర్యాయ నమః" లేదా గాయత్రీ మంత్రాన్ని జపించడం ఎంతో శ్రేయస్కరం.
దానధర్మాలు:
గ్రహణం ముగిసిన తర్వాత పేదలకు అన్నదానం, వస్త్రదానం లేదా ధాన్యాలు దానం చేయడం వల్ల సూర్యగ్రహణ దోషాలు తొలగిపోతాయి.