Sankashti Chaturthi Today: నేడే సంకష్టహర చతుర్థి: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజ.. ఈ రాత్రి చంద్రోదయ సమయం ఎప్పుడంటే?

ఈ రాత్రి చంద్రోదయ సమయం ఎప్పుడంటే?

Update: 2026-02-05 11:36 GMT

Sankashti Chaturthi Today: ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఈ రోజున గణేశుడిని భక్తితో కొలిస్తే జీవితంలోని సంకటాలన్నీ కష్టాలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 5, గురువారం నాడు వచ్చిన ఈ చతుర్థికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

నేటి ప్రత్యేకత - ద్విజప్రియ సంకష్టహర చతుర్థి:

ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ చతుర్థిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల జ్ఞానం, సంపద, ఆరోగ్యం సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

ముఖ్యమైన సమయాలు (నేడు

చతుర్థి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 5, తెల్లవారుజామున 12:09 AM

చతుర్థి తిథి ముగింపు: ఫిబ్రవరి 5, అర్ధరాత్రి 12:22 AM

చంద్రోదయ సమయం రాత్రి 09:26 PM గంటలకు.

సంకష్టహర చతుర్థి ఉపవాసం చంద్ర దర్శనంతోనే పూర్తవుతుంది. కాబట్టి రాత్రి 9:26 గంటల తర్వాతే భక్తులు చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి.

పూజా విధానం

ఉపవాసం: సూర్యోదయం నుండి రాత్రి చంద్ర దర్శనం వరకు ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.

అభిషేకం: గణేశుడికి గరిక (ధూర్వా) మరియు ఎర్రటి పువ్వులతో పూజ చేయడం శ్రేయస్కరం.

నైవేద్యం: వినాయకుడికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్లు లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.

మంత్రం: పూజ సమయంలో "ఓం గం గణపతయే నమః" లేదా "వక్రతుండ మహాకాయ. మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పొందే ఫలితాలు

కార్యసిద్ధి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది.

ఆర్థిక సమస్యలు: పాత అప్పుల నుండి విముక్తి, ఆదాయ వృద్ధికి ఈ వ్రతం దోహదపడుతుంది.

.

గ్రహ3 దోషాలు: జాతకంలో కుజ దోషం లేదా శని ప్రభావం ఉన్నవారు ఈ రోజు పూజ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News