Seeing Spider Webs at Home: ఇంట్లో సాలెగూళ్లు కనిపిస్తున్నాయా? వాస్తు ప్రకారం ఇది పెద్ద ముప్పు.. వెంటనే ఇలా చేయండి
వాస్తు ప్రకారం ఇది పెద్ద ముప్పు.. వెంటనే ఇలా చేయండి
Seeing Spider Webs at Home: ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ వాతావరణం ఇంట్లోని మూలల్లో సాలెపురుగులు గూళ్లు కట్టుకోవడానికి అనువుగా మారుతుంది. చాలామంది ఈ సాలెగూళ్లను కేవలం మురికిగా భావించి వదిలేస్తుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పేరుకుపోయిన సాలెగూళ్లు కేవలం అపరిశుభ్రతకు చిహ్నం మాత్రమే కాదు, అవి మీ జీవితంలోకి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పడకగదిలో సాలెగూళ్లు: బంధాల్లో చిచ్చులు
మీరు పడుకునే గదిలో సాలెగూళ్లు ఉంటే, అవి మీ వైవాహిక జీవితంపై నేరుగా ప్రభావం చూపుతాయి. వాస్తు ప్రకారం.. పడకగదిలో గూళ్లు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కాబట్టి, పడకగది మూలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి.
పూజా గదిలో అశుభం
ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం దేవుని గది. అశ్రద్ధ వల్ల పూజా మందిరంలో సాలెగూళ్లు ఏర్పడితే, అది దురదృష్టానికి సంకేతం. ప్రతిరోజూ పూజ చేసే ముందు గుడిని క్షుణ్ణంగా శుభ్రం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. దైవ ప్రదేశంలో మురికి ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాస్తు చెబుతోంది.
వంటగదిలో ఉంటే ఆరోగ్య ఇబ్బందులు
వంటగదిని మనం అన్నపూర్ణా దేవి నివసించే స్థలంగా భావిస్తాం. శాస్త్రీయంగా చూసినా, వంటగదిలో సాలెగూళ్లు ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరి ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే, వంటగది అల్మారాలు, పైకప్పులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
నివారణ మార్గాలు - పరిహారాలు
ఇంట్లోని ప్రతికూలతను తొలగించి, సాలెపురుగులను దూరంగా ఉంచడానికి ఈ క్రింది సూచనలు పాటించండి..
క్రమబద్ధమైన శుభ్రత: వారానికి కనీసం రెండుసార్లు ఫర్నిచర్ వెనుక, ఇంటి మూలలు, పైకప్పులను శుభ్రం చేయండి.
దీపారాధన: ప్రతిరోజూ ఇంట్లో నూనె దీపం వెలిగించడం, అగరబత్తులు వేయడం వల్ల వచ్చే పొగ కీటకాలను, సాలెపురుగులను దరిచేరనీయదు.
నీటితో శుభ్రం: నేలను తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా క్రిమిసంహారకాలను వాడటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది.