Seeking Goddess Lakshmi’s Blessings: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..ఇంటి ఇల్లాలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు!

ఇంటి ఇల్లాలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు!

Update: 2026-05-29 06:13 GMT

Seeking Goddess Lakshmi’s Blessings: ఇంటికి ఇల్లాలు శ్రీమహాలక్ష్మి అని మన పెద్దలు చెబుతుంటారు. ఒక ఇల్లాలు నడుచుకునే తీరు, ఆమె చేసే పనులపైనే ఆ ఇంటి శాంతి, సౌభాగ్యం, ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం.. పురుషులు పూజ చేసినా, చేయకపోయినా గృహిణులు కచ్చితంగా పూజలు చేస్తుంటారు. అయితే, ఇల్లాలు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో నష్టాన్ని, ఇబ్బందులను కలిగిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు ఎప్పుడూ కూడా పురుషుల కంటే ముందే.. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్రలేచిన వెంటనే సూర్యుడు రాకముందే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే మిగిలిన వారిని నిద్ర లేపాలి. ఇలా సూర్యోదయానికి ముందే ఇంటి పనులు ప్రారంభించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆలస్యంగా నిద్రలేవడం, పనులు ఆలస్యంగా మొదలుపెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి (నెగిటివ్ ఎనర్జీ) పెరిగి, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది. ముందుగా ఇంటిముందు నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. ఆ తరువాత పూజ గది, వంట గది, బెడ్ రూమ్, హాలు, వరండా.. ఇలా వరుస క్రమంలో శుభ్రం చేసుకోవాలి. చాలామంది గదులను శుభ్రం చేసి చెత్తను ఒక మూల పెడతారు. అలా పెట్టడం వల్ల దుమ్ము పేరుకుపోయి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పటి చెత్తను అప్పుడు డస్ట్‌బిన్‌లో వేయాలి. అలాగే, రాత్రి భోజనం చేసిన తర్వాత వాడేసిన గిన్నెలను సింక్‌లో అలాగే ఉంచకూడదు. రాత్రి సమయంలో సింక్‌లో ఎంగిలి గిన్నెలు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని పండితులు చెబుతున్నారు.

ఇక సాయంత్రం వేళ ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక ముఖ్యమైన నియమం పాటించాలి. చీపురుతో ఇల్లు ఊడ్చిన తరువాత వెనుక గది తలుపులు మూసివేసి.. ప్రధాన ద్వారం ఓపెన్ చేసిన తర్వాతే ఇంట్లో లైట్లు వేయాలి. ఎట్టి పరిస్థితిలో లైట్లు వేసిన తరువాత ఇల్లు ఊడ్చకూడదు.

ఇంట్లో పచ్చని మొక్కలు పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ, ఒకవేళ ఇంట్లో మొక్కలు ఎండిపోతే వాటిని వెంటనే తొలగించాలి. ఎండిపోయిన మొక్కలు నెగిటివ్ ఎనర్జీకి సంకేతం. అందుకే మన పెద్దలు తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకునేవారు. పురాణాల ప్రకారం తులసి లక్ష్మీదేవితో సమానం. అలాగే ఇంటి గుమ్మం దగ్గర పచ్చగా ఉండే మనీప్లాంట్ వంటి మొక్కలు అదృష్టాన్ని తెస్తాయి. అయితే ఇంట్లో ముళ్లు ఉన్న మొక్కలను మాత్రం అస్సలు పెంచకూడదు.

Tags:    

Similar News