Shani Dev Enters Revati Nakshatra: రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

Update: 2026-05-18 06:45 GMT

Shani Dev Enters Revati Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, రాశి మరియు నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నవగ్రహాలలో కర్మఫలదాతగా, న్యాయాధికారిగా పిలవబడే శనిదేవుని ప్రతి కదలిక మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆదివారం శనిదేవుడు నక్షత్ర మార్పిడి చేశాడు. బుధుడు అధిపతిగా ఉన్న రేవతి నక్షత్రం లోకి శని ప్రవేశించాడు.

ఈ నక్షత్రంలో శనిదేవుడు అక్టోబర్ 9 వరకు సంచరించనున్నాడు. బుధుడి నక్షత్రంలో శని సంచారం చేయడం వల్ల అరుదైన శుభయోగాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ మార్పు కారణంగా నాలుగు రాశుల వారి జీవితాల్లో అదృష్టం వరించబోతోంది. ఆ రాశులు ఏవి, వారికి ఎలాంటి విజయాలు దక్కబోతున్నాయో తెలుసుకుందాం..

వృషభ రాశి

శని నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి అమితమైన లాభాలను తెచ్చిపెడుతుంది. నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రభుత్వ వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తి అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ కాలం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని వేధించిన మానసిక ఒత్తిడి, కోర్టు కేసులు లేదా ఇతర ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనుకూలమైన మార్పులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభరాశి

కుంభ రాశి వారి జీవితాల్లో శని సంచారం అపారమైన శాంతి, సంతోషాలను నింపుతుంది. ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి పొజిషన్‌కు చేరుకుంటారు. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోయి ఆనందం, శాంతి నెలకొంటాయి. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. శనిదేవుడు మీకు మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏ విషయంలోనైనా ఆలోచించి, సహనంతో ముందడుగు వేయడం అవసరం.

మిథున రాశి వారికి కూడా భలే ఛాన్స్!

రేవతి నక్షత్రంలో శని సంచారం వల్ల మిథున రాశి వారికి కూడా అదృష్ట ముఖద్వారం తెరుచుకోనుంది. వ్యాపారాల్లో లాభాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మొత్తానికి అక్టోబర్ 9 వరకు రేవతి నక్షత్రంలో శనిదేవుడి ప్రయాణం ఈ రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం పూట తైలాభిషేకం లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

Tags:    

Similar News