Shani Transit: శని గోచారం.. జూలై నుంచి ఆ రాశులకు తిరుగుండదు.. శని దేవుడి అనుగ్రహంతో ధన వర్షం..
శని దేవుడి అనుగ్రహంతో ధన వర్షం..
Shani Transit: జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని న్యాయానికి, కర్మఫల ప్రదాతగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి చేసే మంచి, చెడు పనులను బట్టి శని దేవుడు ఫలితాలను ఇస్తాడు. అందుకే శని గ్రహ సంచారానికి, స్థాన మార్పులకు జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. శని చేసే ప్రతి మార్పు 12 రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ఈ క్రమంలో 2026 జూలై నుండి డిసెంబర్ వరకు శని నిరంతర సంచారం చేయబోతున్నాడు. ఈ కీలక మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా 4 రాశుల వారికి వృత్తి, వ్యాపారాలలో భారీ లాభాలతో పాటు అపారమైన అదృష్టం వరించబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
శని నిరంతర సంచారంతో లాభపడే ఆ 4 అదృష్ట రాశులు ఇవే..
వృషభ రాశి
శని దేవుడి సంచారం వృషభ రాశి వారికి అద్భుతమైన పురోగతిని తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు లభిస్తాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా పోగొట్టుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు రావడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత, వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటాయి.
మిథున రాశి
మిథున రాశి వారి జీవితాల్లో ఈ కాలం కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, కెరీర్‌లో ఎదగాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో భారీ ఆర్థిక ప్రయోజనాలకు దారితీస్తాయి. ఎలాంటి పనైనా ఓపికతో, ఆలోచించి చేస్తే విజయాలు మీ సొంతమవుతాయి.
తులారాశి
తులా రాశి వారికి ఈ కాలంలో శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఉద్యోగంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మంచి ప్యాకేజీతో ఉద్యోగం మారాలనుకునే వారికి అనుకూల సమయం. విదేశాలలో పనిచేస్తున్న లేదా విదేశీ వ్యాపారాలు చేసే వారు ఈ కాలంలో అసాధారణ విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుని బలమైన లాభాలను ఆర్జిస్తాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని సంచారం అఖండ అదృష్టాన్ని తీసుకురాబోతోంది. బలమైన ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో మీ పాత అప్పులు తీరిపోతాయి. ఆర్థిక ఒత్తిడిల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. చేస్తున్న వ్యాపారంలో కూడా భారీ లాభాలు ఉంటాయి. కుటుంబంలో, వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.