Highlights of Vijayawada Kanaka Durga: శివలీలలు, శక్తి మహిమలు .. విజయవాడ కనకదుర్గ విశేషాలివే!
విజయవాడ కనకదుర్గ విశేషాలివే!;
Highlights of Vijayawada Kanaka Durga: కోరినవారికి వరాలిచ్చే విజయవాడ కనకదుర్గమ్మ అంటే హిందూ భక్తులకు అపారమైన నమ్మకం. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా ప్రసిద్ధికెక్కింది. కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలసిన అమ్మవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయంగా ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.
ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి దినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.
మొదటి దినము స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి
రెండవ దినము బాల త్రిపురసుందరి దేవి
మూడవ దినము గాయత్రి దేవి
నాలుగవ దినము అన్నపూర్ణా దేవి.
ఐదవ దినము లలితా త్రిపురసుందరి దేవి
ఆరవ దినము సరస్వతి దేవి
ఏడవ దినము దుర్గాదేవి
ఎనిమిదవ దినము మహాలక్ష్మిదేవి
తొమ్మిదవ దినము మహిషాసురమర్దిని
పదవ దినము రాజరాజేశ్వరి దేవి
ఈ ఐదవ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రం గా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.