Married Women Avoid Wearing White: వివాహిత మహిళలు తెల్ల బట్టలు ధరించకూడదా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
Married Women Avoid Wearing White: హిందూ సనాతన ధర్మంలో వస్త్రధారణకు, దుస్తుల రంగులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సమయంలో మహిళలు వేసుకునే బట్టల రంగుల వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి.సాధారణంగా వివాహిత మహిళలు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు వంటి ప్రకాశవంతమైన రంగుల దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ఎట్టి పరిస్థితిలోనూ పూర్తిగా తెల్ల రంగు వస్త్రాలను ధరించరు. అసలు వివాహిత స్త్రీలు తెల్లటి బట్టలు వేసుకోకపోవడానికి గల ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వైరాగ్యం, కోరికల త్యాగం
మన పురాణాల ప్రకారం, తెలుపు రంగు అనేది కేవలం శాంతికే కాదు... వైరాగ్యానికి, లౌకిక సుఖాల త్యాగానికి ప్రతీక. సంసార జీవితంలో ఉంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే వివాహిత స్త్రీలకు వైరాగ్యం తగదు. అందుకే కోరికల త్యాగాన్ని సూచించే ప్యూర్ వైట్ కలర్ దుస్తులను ముత్తైదువులు ధరించకూడదని పండితులు చెబుతుంటారు.
2. లక్ష్మీదేవి స్వరూపం - సౌభాగ్యం
హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీని సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆమె అలంకరణ, ఆమె ధరించే ప్రకాశవంతమైన రంగులు భర్త యొక్క అదృష్టంతో, కుటుంబ సౌభాగ్యంతో ముడిపడి ఉంటాయి. ఎరుపు, పసుపు, కుంకుమ రంగులు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి. అందుకే పెళ్లైన స్త్రీలు ఎల్లప్పుడూ కలర్‌ఫుల్‌గా ఉండాలని శాస్త్రం చెబుతోంది.
3. ప్రతికూల శక్తుల ప్రభావం (Negative Energy)
శాస్త్రాల ప్రకారం, తెల్లటి రంగు చాలా సున్నితమైనది. ఇది ప్రకృతిలో ఉండే ప్రతికూల శక్తులను (నెగెటివ్ ఎనర్జీని) త్వరగా ఆకర్షిస్తుంది. వివాహిత స్త్రీలపై ఎలాంటి చెడు దృష్టి లేదా నకారాత్మక శక్తి ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతోనే, తెలుపు రంగు దుస్తులను వారికి నిషిద్ధం చేశారు.
4. సనాతన ధర్మంలో తెలుపు రంగు ఎప్పుడు వాడతారు?
హిందూ ధర్మంలో అంత్యక్రియల సమయంలో లేదా ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే తెల్లటి దుస్తులు ధరించే ఆచారం శతాబ్దాలుగా వస్తోంది. తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు, భావోద్వేగాలను అణచుకుని, మనసును శూన్యంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి తెలుపు రంగు సహాయపడుతుంది.అందుకే... అంత్యక్రియలు లేదా శోకసమయాల్లో వాడే ఈ రంగును, నిత్యం శుభప్రదంగా, సంతోషంగా ఉండాల్సిన వివాహిత మహిళలు ధరించడం అశుభంగా భావిస్తారు.