Shravan Masam: శ్రావణ మాసం శివుడికి ఎందుకంత స్పెషల్
శివుడికి ఎందుకంత స్పెషల్;
Shravan Masam: శ్రావణ మాసం హిందూ క్యాలెండర్‌లో ఐదవ నెల. ఇది జూలై -ఆగస్టు నెలల మధ్య వస్తుంది. ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు, ముఖ్యంగా శివుడు, లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువులకు ఈ నెల చాలా ప్రీతికరమైనది. వర్షాకాలంలో వచ్చే ఈ మాసంలో ప్రకృతి పచ్చగా కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. శ్రావణ మాసం 2025 జూలై 25 శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23 శనివారం వరకు ఉంటుంది
శ్రావణ మాసం విశిష్టత
శ్రావణ మాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి, శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
స్త్రీలకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. సౌభాగ్యం, సౌశీల్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం అనేక వ్రతాలు, నోములు ఈ మాసంలో ఆచరిస్తారు. అందుకే ఈ నెలను "వ్రతాల మాసం" అని కూడా అంటారు.
వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసం చాలా మంచిదని పండితులు చెబుతారు. ఈ మాసంలో తలపెట్టే పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు.