Significance of Karthika Pournami: కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి.? ఆ రోజు ఏం చేస్తారు.?

ఆ రోజు ఏం చేస్తారు.?

Update: 2025-10-21 06:13 GMT

Significance of Karthika Pournami: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే దీపారాధన, నదీస్నానం, దానధర్మాలు , పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయని ప్రగాఢ నమ్మకం.

కార్తీక పౌర్ణమి విశిష్టత

శివకేశవులకు ప్రీతి: కార్తీక మాసం మొత్తం శివుడు (పరమేశ్వరుడు), విష్ణుమూర్తి (కేశవుడు) ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ పౌర్ణమి నాడు వీరిద్దరిని ఆరాధించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

త్రిపుర పూర్ణిమ: ఈ రోజును త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. దీనికి కారణం, ఈ పవిత్ర దినాన శివుడు త్రిపురాసురుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడిని సంహరించి లోకానికి శాంతిని కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

మత్స్యావతారం: శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం కార్తీక పౌర్ణమి రోజునే అవతరించిందని నమ్ముతారు.

పవిత్ర నదీ స్నానం: వేకువజామున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులు, కాలువలు లేదా సముద్ర స్నానం (నదీ స్నానం) చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

365 వత్తుల దీపారాధన : రోజున 365 వత్తులతో (సంవత్సరంలో ఉన్న రోజులకు గుర్తుగా) దీపం వెలిగిస్తారు. ఇది ఏడాది పొడవునా చేసిన దీపారాధన ఫలితాన్ని ఇస్తుందని, జీవితంలో వెలుగు, సంపద కలుగుతాయని విశ్వాసం.

దీప దానం: దేవాలయాల్లో, తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు వద్ద లేదా నదీ తీరంలో దీపాలను వెలిగించి, వాటిని నీటిలో వదలడం (దీప దానం) చాలా శుభప్రదం. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్మకం.

సత్యనారాయణ వ్రతం: కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని భావిస్తారు.

ఉపవాసం (వ్రతంం): భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం దీపారాధన అనంతరం చంద్ర దర్శనం చేసుకొని, చలిమిడి, వడపప్పు వంటి ప్రసాదాలు స్వీకరించి వ్రతాన్ని విరమిస్తారు.

Tags:    

Similar News