Signs Before the Start of Shani Mahadasha: శని మహాదశ ప్రారంభం అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏంటీ? ఈ కాలంలో అదృష్టం వరించాలంటే ఏం చేయాలి?
ఈ కాలంలో అదృష్టం వరించాలంటే ఏం చేయాలి?
Signs Before the Start of Shani Mahadasha: హిందూ ధర్మంలో శని దేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయానికి అధిపతిగా కొలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని. ఒక వ్యక్తి తన జీవితంలో చేసే మంచి, చెడు పనులను బట్టి శని దేవుడు ఫలితాలను ఇస్తాడని నమ్మకం. ముఖ్యంగా 19 ఏళ్ల పాటు సాగే శని మహాదశ ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
శని మహాదశ అంటే శిక్షా? శిక్షణానా?
చాలామంది శని పేరు వినగానే భయపడతారు. కానీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శని కేవలం శిక్షించే దేవుడు మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడే తత్వాన్ని నేర్పించే గురువు.
ఈ 19 ఏళ్ల కాలంలో కనిపించే ప్రధాన మార్పులు:
సవాళ్లు : ఆర్థిక నష్టాలు, ఉద్యోగంలో ఆటంకాలు, వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు.
మానసిక స్థితి: ఒంటరితనం, మానసిక ఒత్తిడి, కుటుంబ సభ్యులతో కలహాలు లేదా అనవసర నిందలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం: ఆకస్మిక అనారోగ్య సమస్యలు లేదా నివాస మార్పులు సంభవించవచ్చు.
అయితే ఎవరైతే సత్య మార్గంలో నడుస్తారో, కష్టాన్ని నమ్ముకుంటారో.. వారికి ఈ మహాదశ కాలంలోనే ఊహించని విజయాలు, కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని శాస్త్రం చెబుతోంది.
దోష నివారణకు అద్భుత పరిష్కారాలు
శని మహాదశ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిష్యశాస్త్రం కొన్ని శక్తివంతమైన మార్గాలను సూచించింది:
హనుమత్ ఆరాధన: శని దోషాల నుండి విముక్తి పొందడానికి హనుమంతుడిని పూజించడం శ్రేష్ఠం. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
మంత్ర జపం: "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి.
దానధర్మాలు:
శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల శనగలు, నల్లని వస్త్రాలు లేదా ఆవాల నూనెను పేదలకు దానం చేయడం వల్ల శని దేవుడు ప్రసన్నమవుతాడు.
దీపారాధన: శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం.
జీవనశైలి:
పెద్దలను గౌరవించడం, అబద్ధాలు ఆడకపోవడం, పేదలకు సేవ చేయడం వంటివి శని గ్రహ అనుగ్రహానికి రాజమార్గాలు.
శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడు, మిమ్మల్ని మరింత శక్తివంతుడిగా మార్చడమే ఆయన ఉద్దేశం. భక్తితో పాటు నిజాయితీగా కష్టపడితే శని మహాదశ మీకు బంగారు భవిష్యత్తును అందిస్తుంది.