Sri Kodandarama Swamy Temple: జూలై నెలలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

విశేష ఉత్సవాలు

Update: 2026-07-04 06:39 GMT

Sri Kodandarama Swamy Temple: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై నెల‌లో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 4, 11, 18, 25వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై ఊరేగిస్తారు.

– జూలై 14న న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– జూలై 14న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– జూలై 29వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్స‌వర్లకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.

Tags:    

Similar News