Vontimitta Temple: జూలై నెలలో ఒంటిమిట్ట ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే!

విశేష ఉత్సవాలు ఇవే!;

Update: 2025-06-28 04:56 GMT

Ontimitta Temple: వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జూలై నెలలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను కూడా టీటీడీ తాజాగా వెల్లడించింది. జూలై 10న (గురువారం) పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్టుగా తెలిపింది.

జూలై నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జూలై 10న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

జూలై నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జూలై 01న పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం

– జూలై 02న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం

– జూలై 13న శ్రవణా నక్షత్రంగా ఉ. 6.30 స్నపనం, ఉదయం. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.5. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం.

– జూలై 24న పునర్వసు నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.గల. గ్రామోత్సవం

– జూలై 28న పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి సా.3.30 గం.లకు స్నపనం, సా. 05.00 గం.లకు గ్రామోత్సవం

జూలై 29న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం

– ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం.

Tags:    

Similar News