Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి: నెమలి ఈకలతో ఈ పరిహారాలు చేస్తే అద్భుత ఫలితాలు!
ఈ పరిహారాలు చేస్తే అద్భుత ఫలితాలు!;
Sri Krishna Janmashtami: శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. ఇది రాధ పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నెమలి ఈకలు ఇంటికి శుభాలను, అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున నెమలి ఈకలతో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో పాటు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
జన్మాష్టమి నాడు చేయవలసిన పరిహారాలు:
ఆర్థిక సమస్యల నివారణకు: జన్మాష్టమి రోజున 5 నెమలి ఈకలను తీసుకుని, వాటిని శ్రీకృష్ణుని విగ్రహం పక్కన ఉంచండి. ఆ తర్వాత వరుసగా 21 రోజుల పాటు వాటిని క్రమం తప్పకుండా పూజించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
ప్రతికూల శక్తిని తొలగించడానికి: ఇంటి ప్రధాన ద్వారం వద్ద కనిపించే ప్రదేశంలో ఒక నెమలి ఈకను ఉంచండి. ఇది ఇంటిలోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని, ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని చెబుతారు.
ధన ప్రవాహానికి: జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని ఆలయం దగ్గర నుంచి ఒక నెమలి ఈకను తెచ్చి, దానిపై గంగాజలం చల్లండి. ఆ తర్వాత దానిని ఎవరూ చూడకుండా 21 రోజుల పాటు ఇంటి సెల్ఫ్‌లో ఉంచండి. 21 రోజుల తర్వాత దానిని పూజా స్థలంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుందని, ధనానికి కొరత ఉండదని నమ్మకం.
మరికొన్ని ముఖ్యమైన పరిహారాలు:
జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని శిశు రూపాన్ని నెమలి ఈకలతో అలంకరించండి.
వాస్తు దోషాలను తొలగించడానికి, జన్మాష్టమి రోజున ఇంటి తూర్పు దిశలో నెమలి ఈకను ఉంచండి.
వృత్తిలో అభివృద్ధి కోసం, కార్యాలయంలో ఒక నెమలి ఈకను ఉంచండి.
భార్యాభర్తల మధ్య ప్రేమను పెంపొందించడానికి, బెడ్‌రూమ్‌లో నెమలి ఈకను ఉంచడం శుభప్రదం.
ఈ పరిహారాలు జన్మాష్టమి రోజున చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొంది, జీవితంలో సుఖసంతోషాలతో జీవించవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.