Sun–Venus Nakshatra Transit: సూర్య-శుక్రుల నక్షత్ర మార్పు.. ఈ 3 రాశుల వారికి ధన యోగం.. అదృష్టం మామూలుగా లేదు..

అదృష్టం మామూలుగా లేదు..

Update: 2026-06-23 06:58 GMT

Sun–Venus Nakshatra Transit: జ్యోతిష్య లెక్కల ప్రకారం.. గ్రహాలు రాశి మారినప్పుడే కాదు.. ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు కూడా మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జూన్ 22న జరిగిన సూర్య, శుక్రుల నక్షత్ర పరివర్తనం వల్ల కొన్ని రాశుల వారికి గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, హఠాత్తుగా సంపద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆ అదృష్టాన్ని అందుకోబోతున్న ఆ 3 రాశులు ఇవే..

తులా రాశి

సూర్య-శుక్రుల ఈ నక్షత్ర మార్పు వల్ల తులా రాశి వారికి అత్యధిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు జీతాల పెంపు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ కాలం గోల్డెన్ పీరియడ్‌లా మారబోతోంది. సొంతంగా వ్యాపారం చేసే వారికి లాభాల పంట పండుతుంది. పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు ఆదాయం వస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు కావడం, శుక్రుడితో ఈ నక్షత్ర సంబంధం ఏర్పడటం వల్ల వీరికి అద్భుతమైన యోగం పట్టింది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసుల తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో మీ నిర్ణయాలకు, మాటలకు విలువ పెరుగుతుంది.

ఈ యోగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి పరిహారాలు..

సూర్య-శుక్రుల అనుగ్రహం నిరంతరం మీపై ఉండాలంటే జ్యోతిష్యులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు..

సూర్య నమస్కారాలు:

ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం మెరుగవుతాయి.

లక్ష్మీ దేవి ఆరాధన:

శుక్రుడి అనుగ్రహం కోసం శుక్రవారాల్లో లక్ష్మీ దేవిని పూజించడం, తెల్లటి పూలతో అలంకరించడం వల్ల ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది.

దానధర్మాలు:

వీలైనంత వరకు పేదలకు అన్నదానం చేయడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

Tags:    

Similar News