Survivor of the Kurukshetra Battle: కురుక్షేత్ర యుద్ధం తరువాత బ్రతికిన ఏకైక కౌరవుడు?

బ్రతికిన ఏకైక కౌరవుడు?;

Update: 2025-08-01 06:45 GMT

Survivor of the Kurukshetra Battle: మహాభారతం ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటి. ఇది సుమారు లక్ష శ్లోకాలు, 18 పర్వాలు, మరియు లక్షలాది పదాలతో విస్తరించి ఉంది. దీన్ని రచించినది వేదవ్యాసుడు. మహాభారతాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, నీతి, రాజనీతి, మోక్షం వంటి జీవిత సత్యాలను బోధించే ఒక గొప్ప గ్రంథం. హాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉండగా, గణపతి లిఖించాడని పురాణాలు చెబుతాయి. వ్యాసుడు శ్లోకాలను అంతర్లీనంగా చెబుతూ ఉండగా, గణపతి వినాయకుడు అవిరామంగా రాసాడని ప్రసిద్ధి. కురుక్షేత్ర యుద్ధం తరువాత ప్రాణాలతో బ్రతికిన ఏకైక కౌరవుడు యుయుత్సుడు. ఇతను ధృతరాష్ట్రుడికి దాసీ స్త్రీకి జన్మించిన కుమారుడు. అందువల్ల అతడు గాంధారి కుమారులలో ఒకడు కాదు, కానీ కౌరవుల బృందంలో ఒకడిగా పరిగణించబడ్డాడు. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు, ధర్మరాజు చేసిన ప్రకటన విని, ధర్మాన్ని అనుసరించి పాండవుల పక్షంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా అతడు యుద్ధంలో బ్రతికాడు. యుద్ధం తరువాత, యుధిష్ఠిరుడు హస్తినాపురం సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, యుయుత్సుడిని తన మంత్రిగా నియమించుకున్నాడు. పాండవులు స్వర్గారోహణానికి వెళ్ళే ముందు, పరీక్షిత్తుకు సంరక్షకుడిగా అతడిని నియమించారు. ఈ విధంగా యుయుత్సుడు ధర్మబద్ధమైన వ్యక్తిగా మహాభారతంలో నిలిచిపోయాడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుడి కుమారుడే అయినప్పటికీ, గాంధారికి జన్మించలేదు. గాంధారికి నూరుగురు పుత్రులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ, ఆమె గర్భం దాల్చిన సమయంలోనే ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య దాసి ద్వారా యుయుత్సుడు జన్మించాడు. ఈ కారణంగా అతడు దుర్యోధనుడికి సవతి సోదరుడు. యుయుత్సుడు కౌరవ శిబిరంలో పెరిగినప్పటికీ, దుర్యోధనుడి అన్యాయపూరిత ఆలోచనలను, కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాడు. పాండవుల పట్ల, ముఖ్యంగా భీముడి పట్ల అతడికి ఎల్లప్పుడూ సానుభూతి ఉండేది. దుర్యోధనుడు భీముడిని విషంతో చంపడానికి ప్రయత్నించినప్పుడు, యుయుత్సుడు ఈ విషయాన్ని పాండవులకు తెలియజేసి వారి ప్రాణాలు కాపాడాడు.

Tags:    

Similar News