Avoid These 3 Things: జీవితంలో ఈ 3 విషయాలు చెడు పరిణామాలను దారితీస్తాయి.. తస్మాత్ జాగ్రత్త..
తస్మాత్ జాగ్రత్త..;
Avoid These 3 Things: మనందరికీ జీవితంలో ప్రతిదానిలోనూ గెలవాలనే కోరిక ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో వైఫల్యాలు, ఎదురుదెబ్బలు ఎదురైనప్పుడు మనం కృంగిపోతాము. వాటిని సాధించడంలో మనం ఎక్కడ తప్పు చేశామో పరిశీలించకోము. ఈ సమయంలోనే నిపుణులు చెప్పే విషయాలు మనల్ని విజేతలుగా చేస్తాయి. ఆ విషయంలో గొప్ప జ్ఞానిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతి అనే పుస్తకంలోని సూత్రాలను పాటిస్తే, జీవితంలో అనేక సమస్యలను నివారించవచ్చని చాలా మంది నమ్ముతారు. చాణక్యుడి నీతి ప్రకారం, కొన్ని పనులు చేయడం తప్పు. ముఖ్యంగా ఈ మూడు అలవాట్లు జీవితంలో సమస్యలను కలిగిస్తాయని అంటారు. అవేంటో తెలుసుకుందాం.
ప్రశంసించడం
కొంతమందికి తమను తాము ప్రశంసించుకునే అలవాటు ఉంటుంది. ఇది అహంకారం వైపు మొదటి అడుగు. తనను తాను పొగుడుకొనేవాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడని చాణక్యుడు అంటాడు. స్వీయ ప్రశంసలు ఒక వ్యక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాకుండా, అతని వ్యక్తిత్వాన్ని కూడా బలహీనపరుస్తాయి. ఒక వ్యక్తి తనను తాను పదే పదే గొప్పగా భావిస్తే.. అతని గర్వం పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు అతను తన తప్పులను విస్మరిస్తాడు. చాణక్యుడి ప్రకారం, ఒక గొప్ప వ్యక్తి ఇతరుల ముందు తన గురించి తాను గొప్పలు చేప్పుకోడు. ఇతరులు మనల్ని గొప్పవాళ్ళమని పిలిచినప్పుడు మాత్రమే మనం ప్రత్యేకమైన వారమని గ్రహించాలి.
ఇతరులను విమర్శించడం
ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం ప్రతికూల మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఇతరుల వెనుక చెడుగా మాట్లాడటం వల్ల ఆ వ్యక్తి తన విలువలను, వ్యక్తిత్వాన్ని కోల్పోతాడని చాణక్యుడు చెప్పాడు. ఈ లక్షణం సమాజంలో మీ ప్రతిష్టను నాశనం చేస్తుంది. ఇతరులలో తప్పులను మాత్రమే చూసే వ్యక్తి తనను తాను ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేడు. కాబట్టి, అందరినీ విమర్శించే బదులు, మీ తప్పులను గుర్తించి వాటిని మెరుగుపరచుకోవాలి.
ప్రదోష దర్శనం
ప్రదోష సమయంలో, అంటే సాయంత్రం వేళల్లో, చెడు ఆలోచనలు, చెడు సహవాసం లేదా అపవిత్ర ప్రదేశాలను సందర్శించడం మానుకోవాలి. ప్రదోష దర్శనం ఒకరి శక్తిని ప్రతికూలంగా మార్చగలదని చాణక్యుడు అంటాడు. ఇది ఆత్మపరిశీలన, ధ్యానం లేదా దేవుని ఆరాధన కోసం కేటాయించిన సమయం. ఈ సమయంలో ఒక వ్యక్తి తప్పుడు ఆలోచనలు లేదా చర్యలలో మునిగిపోతే, వారి మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత క్షీణిస్తుందని నమ్ముతారు.